పూరి జగన్నాధ్ కు సుమారు అరడజను ప్లాప్స్ తరువాత ఇష్మార్ట్ శంకర్ రూపంలో ఎట్టకేలకు ఒక హిట్ వచ్చింది. అయితే ఇష్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయిన ఆనందంలో పూరీ టాప్ హీరోల మీద సంచలన కామెంట్స్ కూడా చేశారు. మహేష్ మీద అనవసరంగా నోరు పారేసుకోని అతని అభిమానుల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే పూరికి హిట్ అయితే వచ్చింది కానీ నెక్స్ట్ తనతో సినిమా తీసే హీరో అయితే దొరకటం లేదు. 


నిజానికి మళ్ళీ పూరికి పెద్ద హీరోలు అవకాశాలు ఇచ్చే రేంజ్ లో ఏమి సినిమా లేదని చెప్పాలి. సినిమా చాలా మంది మామూలుగానే ఉందని చెప్పారు. నిజం చెప్పాలంటే ఈ సినిమా కూడా పూరి పాత సినిమాల మాదిరిగానే ఉందని చెప్పాలి. సినిమాలో సరైనా కథా బలం లేకపోవటం, సినిమా మొత్తం హీరో క్యారక్టరైజేషన్ మీద నడిపించటంతో పూరి ఏం మారలేదని చెప్పాలి. పెద్ద హీరోలు కాదు కదా మీడియం రేంజ్ హీరోలు కూడా పూరితో సినిమా చేయడానికి ఇష్టపడటం లేదు. 


పూరికి అప్పుడప్పుడు హిట్ సినిమాలు తీయడం కొత్తేమి కాదు. ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా తీసి హిట్ కొట్టారు. తరువాత వెంటనే జ్యోతిలక్ష్మి సినిమా రూపంలో పెద్ద ప్లాప్ ను ఇచ్చారు. ఇక అక్కడ నుంచి చాలా ప్లాప్ మూవీస్ తీసారు. ఆ ప్లాప్స్ అన్నింటిని మరిచిపోయే రేంజ్ లో ఇష్మార్ట్ శంకర్ సినిమా లేదని చెప్పాలి. విజయ దేవరకొండతో పూరీ సినిమా ఉంటుందని ఆ మధ్య టాక్ వచ్చింది. కానీ అదేమీ నిజం కాదని విజయ దేవరకొండ కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే రామ్ చరణ్. ప్రభాస్, చిరంజీవి వీరందరూ సినిమా బాగుందని మెచ్చుకున్న వీరెవరూ కూడా పూరికి అవకాశాలు ఇచ్చే మాదిరిగా కనిపించడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: