తెలుగు బిగ్ బాస్ 3 మొదలై విజయవంతంగా ఓ వారం పూర్తి చేసుకుంది. తెలుగు ప్రేక్షకులు ఈ షోకి బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే టీఆర్పీ రేటింగులు కూడా దుమ్ము రేపుతున్నాయి. మ‌రో వైపు కింగ్ నాగార్జున హోస్ట్‌గా విజృంభిస్తుండ‌డంతో బాగ్‌బాస్ చూసేందుకు ప్రేక్షకులు టీవీల‌కు అతుక్కుపోతున్నారు. ఇక హౌస్‌మేట్స్ గొడ‌వ‌తో షో రోజు రోజుకు ర‌క్తిక‌డుతోంది. ఈ షో ప్రారంభానికి ముందు షోలో తలెత్తిన వివాదాలన్నీ సద్దుమణిగి సక్రమంగా సాగుతున్న తరుణంలో, దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఈ షోని వదిలేలా కనపడటం లేదు.


ఈ షో ప్రారంభానికి ముందే కేతిరెడ్డి బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ కోర్టులో పిటీషన్ కూడా వేయడం జరిగింది. బిగ్‌బాస్‌పై త‌న పోరాటం కంటిన్యూ చేస్తోన్న కేతిరెడ్డి బిగ్ బాస్ రియాలిటీ షో కి వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది అన్న కేతిరెడ్డి, దేశవ్యాప్తంగా తిరిగి బిగ్ బాస్ షో కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానంటూ హెచ్చ‌రించారు.


ఇక ఈ షోకు హోస్ట్‌గా ఉన్న కింగ్ నాగార్జున‌ను కూడా ఆయ‌న వ‌ద‌ల్లేదు. నాగార్జునను టార్గెట్‌గా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అన్నమయ్య,రామదాసు వంటి భక్తిరస సినిమాలలో నటించిన ఆయన ఇలాంటి రియాలిటీ షో వ్యాఖ్యాతగా ఎలా వ్యవహరిస్తారంటూ దుయ్యబట్టారు. ఈ షో యువతను పెడదోవ పట్టించేదిగా ఉందని ఆరోపించారు. 


దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షో పై వ్యతిరేకత ఉన్నప్పటికీ అన్ని భాషలలో ఈ రియాలిటీ షో నిరవధికంగా సాగిపోతుంది. ఒక్క తెలుగులోనే కాదు... అటు బాలీవుడ్‌లోనూ, ఇటు త‌మిళంలోనూ బిగ్ బాస్ షోపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయినా ఈ షోకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్‌లు వ‌స్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: