సంజయ్ దత్ అక్రమ ఆయుధాల కేసులో ఇరుక్కుని పలుసార్లు జైలుకు వెళ్ళకుండా ఉండి ఉంటే బాలీవుడ్ లో ఖాన్ త్రియం హీరోల కంటే ఎప్పుడో బాలీవుడ్ నెంబర్ వన్ గా ఇండస్ట్రీని శాసించి ఉండేవాడు అని అంటారు. ప్రస్తుతం తన వయస్సుకు తగ్గ పాత్రలను చేస్తూ ఇప్పటికీ బాలీవుడ్ టాప్ సెలెబ్రెటీగా కొనసాగుతున్న సంజయ్ దత్ గురించి మహేష్ భార్య నమ్రత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను వివరించింది. 

తాను మహేష్ తో ప్రేమలో పడకముందు 7 సంవత్సరాల పాటు బాలీవుడ్ లో హీరోయిన్ గా నటించిన విషయాలను వివరిస్తూ అప్పట్లో తాను సంజదత్ తో కలిసి నటించిన సినిమాల గురించి వివరిస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. సంజయ్ దత్ కు అనేకమంది హీరోయిన్స్ తో రిలేషన్ షిప్ ఉంది అని అప్పటికే వార్తలు ఉన్న నేపధ్యంలో తాను సంజయ్ దత్ తో నటించడానికి భయపడిన విషయాలను వివరించింది. 

అయితే తాను విన్న వార్తలకు సంజయ్ దత్ ప్రవర్తనకు చాల తేడా ఉందని తనతో నటించే హీరోయిన్స్ పట్ల చాల సంస్కారవంతంగా ఉండటమే కాకుండా ఒక విధంగా హీరోయిన్స్ కు ముఖ్యంగా తనకు ఒక బాడీ గార్డ్ లా సంజయ్ దత్ తన పక్కన నిలబడుతూ తనకు ధైర్యం చెప్పిన విషయాలను వివరించింది. అప్పట్లో తాను మహేష్ బాబుతో ప్రేమలో ఉన్నాను అని సంజయ్ దత్ తో చెప్పినప్పుడు తనను ప్రోత్సహించిన మొదటి వ్యక్తి సంజయ్ దత్ అని చెపుతూ ఇప్పటికీ తమ మధ్య ఆ సాన్నిహిత్యం కొనసాగుతోంది అని వివరణ ఇచ్చింది. 

సంజయ్ దత్ 60వ పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత సంజయ్ దత్ గురించి తన అభిప్రాయాలు షేర్ చేసింది. ప్రస్తుతం సంజయ్ దత్ ‘కేజీ ఎఫ్ 2’ లో మెయిన్ విలన్ పాత్రను చేస్తున్న పరిస్థుతులలో ఈసినిమా ద్వారా మరొకసారి సంజయ్ దత్ కు దక్షిణాది భాషలలో విలన్ గా చాల అవకాశాలు వచ్చి ఒక విధంగా జగపతి బాబుకు ప్రత్యామ్నాయంగా మారుతాడా అనే ఆసక్తికర అంచనాలు కూడ ఉన్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: