బాహుబలి సినిమా ఇచ్చిన స్ఫూర్తితో టాలీవుడ్ లో నిర్మాతలు కాస్తా ధైర్యం చేసి భారీ బడ్జెట్ చిత్రాలు తీయడానికి ముందుకొస్తున్నారు. బాలీవుడ్ కంటే ముందుగానే వంద కోట్లకి పైగా బడ్జెట్ తో సినిమాలు తీసి తెలుగు సినిమా స్టామినా చూపించిన రాజమౌళి దర్శకులకి స్ఫూర్తి ఇచ్చాడు. దీంతో దర్శకులు కూడా వంద కోట్ల కథలతో నిర్మాతలని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తెలుగులో సాహో, సైరా, జాన్, ఆర్ఆర్ఆర్ సినిమాల బడ్జెట్ ఏకంగా రెండు వందల కోట్లకి పైగానే ఉన్నాయి. ఈ సినిమాలు ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి.


అయితే సినిమా తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తే ఏదో ఒక విధంగా నిర్మాత బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాని బడ్జెట్ పరిధి పెరిగితే ఇక సినిమా కచ్చితంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవాలి. లేదంటే అసలుకె ప్రమాదం వస్తుంది. బాహుబలి రికార్డ్ కలెక్షన్ సొంతం చేసుకున్న అదే స్ఫూర్తి తో బాలీవుడ్ లో నిర్మించిన థంగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమా డిజాస్టర్ అయ్యి నిర్మాతకి భారీ నష్టాలు మిగిల్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగులో సాహో సినిమా ఆగష్టు నెలాఖరున రిలీజ్ కి రెడీ అవుతుంది,  ఈ సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన ఒక బయ్యర్లు దారుణంగా దెబ్బ తింటారు. 


ఈ నేపధ్యంలో ఇప్పుడు నిర్మాతల నుంచి పెద్ద సినిమాలు కొని రిలీజ్ కి రెడీ అవుతున్న బయ్యర్ల వరకు అందరికి టెన్షన్ పట్టుకుంది. ఈ సినిమాలు మార్నింగ్ షో నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే పర్లేదు. లేదంటే ఏ మాత్రం ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న, ఆడియన్స్ ఏ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసిన ఇక పుంజుకోవడం కష్టం. ఈ నేపధ్యంలో సినిమా మీద పెట్టుబడి పెట్టిన నిర్మాతలు కొంత వరకు సేఫ్ అయిన డిస్టిబ్యూటర్స్ మాత్రం భయం భయంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాల వైపు చూస్తున్నారు. ఇక ఈ ఏడాదిలో మొదటిగా వస్తున్నా సాహో రిజల్ట్ మిగిలిన పెద్ద సినిమాల భవిష్యత్తుని కూడా నిర్ణయించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: