కాజాల అగర్వాల్ తెలుగులో చందమామ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తరువాత కొన్ని ప్లాప్స్ వచ్చిన రాజమౌళి సినిమా మగధీరలో నటించడంతో కాజల్ ఒక్క సారిగా టాప్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది. వరుసగా స్టార్ హీరోల సరసన నటించేందుకు అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్  ఇలా అందరీ సినిమాల్లో నటించి అభిమానులు చేరువయ్యింది. దీనితో కాజల్ కు అన్నీ భాషలో వరుస ఆఫర్స్ వచ్చాయి. 


బాలీవుడ్ లో అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తమిళంలో కూడా విజయ్ లాంటి పెద్ద హీరోల సరసన నటించి అక్కడ కూడా క్రేజీ హీరోయిన్ గా పేరు పొందింది. అయితే కాజల్ సినీ ఫిల్డ్ లో అడుగు పెట్టి ఇప్పటికే పదేళ్లు దాటిపోయింది. అయినా అందం విషయంలో ఇప్పటికీ ఎక్కడ తగ్గలేదు. గ్లామర్ ను చూపించడంలో. మైంటైన్ చేయడంలో కాజల్ ఎవరు సాటిరారని చెప్పాలి. 


అయితే కాజల్ కు ఎన్ని హిట్స్ వచ్చినా నటన పరంగా అంత మంచి పేరు రాలేదని చెప్పాలి. ప్రతి సినిమాలో కాజల్ కు గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి గాని నటన ప్రాధాన్యత ఉన్న సినిమాలో కాజల్ పెద్దగా నటించక పోవటం వల్ల నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో నిర్మాతలు కాజల్ ను ఉహించుకోలేకపోతున్నారు. అందుకే లేటెస్ట్ గా కొరటాల  చిరంజీవి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ కు నటన ప్రాధాన్యత ఉన్న పాత్ర . దీనితో కాజల్ గురించి డిస్కషన్ వచ్చిన కాజల్ సెట్ అవుతుందా అని ఫిల్మ్ మేకర్స్ ఆలోచించినట్లు సమాచారం. దీనితో కాజల్ కు గ్లామర్ పరంగా ఎవరు సాటిరాకుండా నటన విషయంలో కాజల్ వెనక్కి పడిపోతుంది. సీత సినిమా వచ్చిన అది కూడా కాజల్ గ్లామర్ మీదే ఆధారపడి నడిచిన సినిమా. 

మరింత సమాచారం తెలుసుకోండి: