ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా హిట్లతో దూసుకుపోతోంది కైరా అద్వానీ. తాజాగా వ‌చ్చిన క‌బీర్‌సింగ్ ( తెలుగు అర్జున్‌రెడ్డి రీమేక్‌) సినిమాతో కైరా దేశ‌వ్యాప్తంగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్లు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వ‌డంతోనో లేదా వ‌య‌స్సు పైబ‌డ‌డంతో లిమిటెడ్‌గా సినిమాలు చేస్తుండ‌డంతోనో ఇప్పుడు అంద‌రూ హీరోలు కైరా వైపే చూస్తున్నారు.


బాలీవుడ్‌లో సీనియ‌ర్ హీరోల నుంచి జూనియ‌ర్లు, కుర్ర హీరోలు అంద‌రూ ఇప్పుడు కైరానే త‌మ సినిమాల్లో పెట్టుకుని ఆమెతోనే రొమాన్స్ చేసేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఇక తెలుగులో కూడా కైరా మ‌హేష్‌బాబు స‌ర‌స‌న భ‌ర‌త్ అనేనేను సినిమాతో పాటు చెర్రీ స‌ర‌స‌న విన‌య విధేయ రామ సినిమాలో న‌టించింది. ఇప్పుడు ఆమె తెలుగులో న‌టించేందుకు డేట్లే లేవు. అంత బిజీ అయిపోయింది.


ఇక ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అలియా అద్వానీ. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సూచనతో ఈమె పేరు మార్చుకుంది. బాలీవుడ్ లో అప్పటికే అలియా భట్ ఉండటంతో పేరు మార్చుకోమని సల్మాన్ చెప్పాడు. దీంతో, ఆమె కైరా అద్వానీగా పేరు మార్చుకుంది. ఇప్పుడు ఆమె కుటుంబసభ్యులు కూడా ఆమెను కైరా అనే పిలుస్తున్నారట.


ఇక ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు ఇషా అంబానీ, కైరా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. సల్మాన్, షారుఖ్ ఖాన్ అంటే కైరాకు చాలా అభిమానం. ఇక ఇప్పుడు కైరా స్టార్ హీరోయిన్ అయిపోవ‌డంతో ఆమె దృష్టంగా బాలీవుడ్ మీదే ఉంది. ఇప్పుడు తెలుగుతో పాటు సౌత్‌లో ప‌లువురు హీరోలు ఆమెను త‌మ సినిమాల్లో న‌టింప‌జేసేలా ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా కైరా మాత్ం డేట్లు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ట. ఇక క‌బీర్‌సింగ్ సినిమాతో కైరా రేటు కూడా చుక్క‌ల‌నంటుతోంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: