అక్టోబర్ మాసంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు చిరంజీవి మరియు వెంకటేష్ సినిమాలు విడుదలవుతున్న క్రమంలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సైరా వర్సెస్ వెంకీ మామ అన్నట్టుగా వాతావరణం ఇప్పటి నుండే క్రియేట్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా సినిమా పై మెగా అభిమానులు చాలా అంచనాలు పెట్టుకోవడం జరిగింది. అయితే భారీ అంచనాలు మెగా అభిమానులు పెట్టుకున్న ఈ సినిమా రాబోయే దసరాకి అనగా అక్టోబర్ మాసంలో గాంధీ జయంతి నాడు రెండవ తారీకున విడుదల చేయటానికి నిర్మాత రాంచరణ్ గట్టిగా ప్లాన్ చేసినట్లు ఇప్పటికే వార్తలు వినబడుతున్నాయి.


మరోపక్క ఇదే సమయానికి విక్టరీ వెంకటేష్ నటించిన వెంకీ మామ సినిమా కూడా విడుదలవుతున్నట్లు హుజూర్ నగర్ లో వార్తలు వినపడుతున్నాయి. అక్టోబర్ 4వ తారీఖున అనగా సైరా సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత వెంకీ మామ సినిమా విడుదల చేయటానికి ఈ సినిమా యూనిట్ డిసైడ్ అయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. తొలిసారిగా మామ-మేనల్లుడు వెంకీ-నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా ఇది.


ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ మూవీస్ కలిసి నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ కాంబినేషన్ ఓ బేబీ సినిమాతో మాంచి హిట్ కొట్టారు. ఈ సినిమాకి బాబి దర్శకుడు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కి జై లవ కుస వంటి సూపర్ డూపర్ ఇచ్చిన భావి తరువాత వస్తున్న సినిమా ఇదే. తమన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ మిలట్రీ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మొత్తమ్మీద రాబోయే దసరాకి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర సైరా వర్సెస్ వెంకీ మామ అన్నట్టుగా వాతావరణం నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: