దాదాపు కొన్ని దశాబ్దాల నుండి టాలీవుడ్ సింహాసనాన్ని ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22వ తారీఖున మెగా అభిమానులకు మెగా కానుక సైరా టీం ప్లాన్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో తెరకెక్కిన సైరా సినిమా పై మెగా అభిమానులు ఇప్పటికే చాలా అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు చిరంజీవి నటించిన సినిమా విడుదల అయ్యి రెండు సంవత్సరాలు కావస్తున్నా క్రమంలో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి రాజకీయాల్లో ఒకపక్క ఉంటేనే మరోపక్క ఎక్కువగా సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేసి చేస్తున్న రెండవ సినిమా అయిన నేపథ్యంలో 'సైరా' సినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు.


ఇదే క్రమంలో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఎక్కడా కూడా తగ్గకూడదని క్వాలిటీ బాగా ఉండాలని అవుట్ పుట్ అదిరి పోవాలని...గట్టిగా ఆర్డర్స్ వేయడంతో...ఈ సినిమా కోసం చాలా టైమ్ తీసుకుని సురేందర్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించినట్లు సినిమా యూనిట్ నుండి వస్తున్న సమాచారం. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో స్వాతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను చిరంజీవి చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అమితాబచ్చన్ ఇంకా చాలామంది భారీ తారాగణం సినిమాలో ఉండటం ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.


అయితే సినిమా అక్టోబర్లో రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తున్న నేపథ్యంలో సైరా టీమ్ ప్రమోషన్స్ పై పడ్డారు.ప్రమోషన్స్ లో భాగంగా ఎప్పటి నుంచో చెప్తున్నా సైరా మేకింగ్ వీడియో ఈ ఆగష్టు మొదటి వారంలో విడుదల చేయబోతున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం.ఇదే ఆగష్టు నెలలో 22వ తారీఖున చిరు పుట్టిన రోజు సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేయనున్నారని ప్రస్తుతం ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. ఎప్పటినుండో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు కచ్చితంగా రాబోయే చిరంజీవి పుట్టినరోజు మెగా పండుగ అని ఈ సినిమా గురించి తెలుసుకున్న చాలామంది ఇండస్ట్రీ వారు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: