బాలీవుడ్ నిర్మాత,దర్శకుడు కరణ్ జోహార్ ఇటీవల తన ఇంట్లో పలువురు బాలీవుడ్ నటీనటులకు పార్టీ ఇచ్చారు. దీపికా పదుకొణే,రణబీర్ కపూర్,విక్కీ కౌశల్,అర్జున్ కపూర్,మలైకా అరోరా,షాహిద్ కపూర్ సహా తదితరులు పార్టీకి హాజరయ్యారు. పార్టీకి సంబంధించి రెండు రోజుల క్రితం ఓ వీడియోను కరణ్ జోహార్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 


ఈ వీడియోలో సెలబ్రిటీల ముఖాలు చూశాక.. వారు డ్రగ్స్ తీసుకున్నారేమోనన్న అనుమానాలను పలువురు లేవనెత్తుతున్నారు. తాజాగా శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యే మజీందర్ సిర్సా ట్విట్టర్‌లో వారిపై విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ నటీనటుల నిజస్వరూపం ఇదేనని.. డ్రగ్స్ మత్తులో తూలుతూ ఎంత గర్వంగా పోజులిచ్చారో చూడండి అంటూ ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తన గొంతు వినిపిస్తున్నానని తెలిపారు. అయితే మజీందర్ సిర్సా ఆరోపణలను,విమర్శలను కాంగ్రెస్ నేత మిలింద్ దేవర ఖండించారు. 


తప్పుడు ఆరోపణలు చేస్తున్నందుకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఆ పార్టీలో తన భార్య కూడా ఉందని.. అక్కడ ఎవరూ డ్రగ్స్ సేవించలేదని.. వారి ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్యాలు ప్రచారం చేయవద్దని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


మన టాలీవుడ్ ని సైతం ఈ డ్రగ్స్ దుమారం వదల్లేదు, తాజాగా పోలీసులు జరిపిన దర్యాప్తు లో, మళ్ళి సిబిఐ వాళ్ళు కండక్ట్ చేసిన ఇంటర్వూస్ లోను మన టాలీవుడ్ తరాలకి,  డ్రగ్స్ మాఫియా కి కనెక్షన్ ఉండనే ఉంది అని సాక్ష్యాలతో సహా బయటపడింది, కానీ ఏ ఒక్క సెలబ్రిటీ కూడా అరెస్ట్ అవ్వలేదు. కొందరు ఇదంతా ఫేక్ అంటే, ఇంకొందరు, నిజాలని తొక్కేశారని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా, మళ్ళి డ్రగ్స్ టాపిక్ రావడం తో ఈ సరి దేశం ద్రుష్టి మొత్తం ఇప్పుడు బాలీవుడ్ మీదనే ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: