సింహ సినిమాలో బాలక్రిష్ణతో నమిత ఆడిపాడింది. సింహా..సింహా అనే పాట బాగానే పాపులరైంది. బాలక్రిష్ణతో పూర్తిస్థాయి రోల్‌లో నటించాలని హీరోయిన్ నమితకు ఎప్పటి నుంచో కోరికట. అయితే ఆ కోరిక కె.ఎస్.రవికుమార్ ద్వారా తీరుతుంది అనుకుందట. కానీ నమితను తన సినిమాలో తీసుకునేందుకు దర్సకుడు ఇష్టపూర్వకంగా లేరట.


బాలక్రిష్ణతో యాక్షన్ సినిమాను తీసేందుకు కె.ఎస్.రవికుమార్ సిద్థమయ్యారు. హీరోయిన్ సోనాల్ చౌహాన్. ఈ సినిమాలో ఆడ విలన్ కావాలట. అది కూడా బాలక్రిష్ణ ఫిజిక్‌కు తగ్గట్లు సరిగ్గా సరిపోవాలి. అందులోను గ్లామర్ కూడా ఉండాలట. అందుకే విలన్ క్యారెక్టర్ల కోసం వెతుకుతున్నారట దర్సకుడు కె.ఎస్.రవికుమార్. అసలే ఆఫర్లు లేక విలవిలలాడుతున్న నమిత కి ఈ ఆఫర్ వర్కౌట్ అయితే మళ్ళి టాలీవుడ్ లోకి ఎంట్రీ కి మార్గం దొరుకుతుంది అని, అలానే ఐటెం సాంగ్స్ ఆఫర్స్ కుదవస్తాయని నమిత ఫీల్ అవుతూ ఉండడం తో ఈ ఆఫర్ ని ఎలాగైనా దక్కించుకోవాలని అమ్మడి రాయత్నాలు సాగుతున్నాయి.  కానీ డైరెక్టర్ మాత్రం ప్రస్తుతం నమ్రత కి సూట్ అయ్యే క్యారెక్టర్ ఏమి లేకపోవడం తో నిరాకరిస్తునట్టు సమాచారం.


అయితే మొదట్లో నమితను ఈ సినిమాలో తీసుకోవాలని దర్సకుడు అనుకున్నారట. అయితే ఆమె ఆ క్యారెక్టర్‌కు సరిపోదని సినిమా యూనిట్ లోని కొంతమంది దర్సకుడికి చెప్పడంతో ఆయన కూడా వెనక్కి తగ్గారట. తన పేరును ప్రతిపాదించి చివరకు తాను వద్దనుకోవడంతో నమిత ఎలాగైనా ఆ సినిమాలో నటించాలని నిర్ణయించేసుకుందట.


తనకు పరిచయం ఉన్న బాలక్రిష్ణ వెంటపడుతూ అవకాశం తీసివ్వాలని కోరుతోందట. అయితే ఆ సినిమాలో విలన్‌గా నీకే అవకాశం ఇచ్చేలా డైరెక్టర్‌ను నేను ఒప్పిస్తానని బాలక్రిష్ణ హామీ ఇచ్చారట. ఆగష్టు 7వ తేదీ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: