నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఇటీవల కాలం వరకు బిజీ నటుడిగా ఉన్నారు.  ఒకప్పుడు రచయితగా తన ప్రస్థానం మొదలు పెట్టిన పోసాని తర్వాత దర్శకుడిగా మారారు.  ఇక దర్శకుడిగా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో నటుడిగా మారారు.  నటుడి గా తన ప్రస్థానం మొదలు పెట్టిన తర్వతా పోసాని మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.  వరుస సినిమాలతో బిజీ నటగుడిగా మారిపోయాడు. 

ఎన్నో విలక్షణ పాత్రల్లో నటిస్తున్న పోసాని ఆ మద్య వైసీపీ తరుపు నుంచి మాట్లాడుతూ అప్పటి అధికార పార్టీపై ఎన్నో విమర్శలు చేశారు.  మొత్తానికి ప్రస్తుతం ఏపీలో టీడీపీ దారుణంగా ఓడి పోవడం..వైసీపీ ఘన విజయం సాధించడం జరిగింది.  ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చే ముందు పోసాని అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

తాజాగా పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశం నిర్వహించి మరోసారి తన ఆరోగ్య గురించి క్లారిటీ ఇచ్చారు. ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ సోకడం వల్ల మరోసారి అనారోగ్యానికి గురైనట్లు పోసాని తెలిపారు. వరుసగా జ్వరాలు రావడం..చెమటలు పోయడంతో ఉన్నట్టుండి నీరసించి పోయానని అన్నారు. ఉన్న ఫలంగా 10 కేజీల బరువు తగ్గిపోయానని అన్నారు. పరిస్థితి గమనించి తనకు ఆపరేషన్ చేసిన వైద్యుడు ఇన్ఫెక్షన్ సోకిందని గుర్తించడంతో చాలా మేలు జరిగింది.  లేదంటే నేను ఈపాటికి చచ్చిఊరుకునే వాడిని అన్నారు.

రెండు సార్లు ఆపరేషన్ జరిగిందంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. మీడియాలో కూడా విషమ పరిస్థితుల్లో పోసాని అంటూ వార్తలు వచ్చాయి. నా ఆరోగ్యం గురించి పుకార్లు సృష్టించడం వల్ల సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయి. అయితే నిజం ఇప్పటికైనా తెలుసుకొని మీడియా ఉన్న నిజాలు రాస్తే..తెలిపితే బాగుంటుందని అన్నారు.   ఇకపై తన ఆరోగ్యం గురించి ఎలాంటి పుకార్లు రాకుండా క్లారిటీ ఇవ్వడానికే ఈ మీడియా సమావేశం నిర్వహించినట్లు పోసాని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: