బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇప్పుడు సినిమా నిర్మాణ ఖర్చు విపరీతంగా పెరిగింది. పెద్ద హీరోల సినిమాలు అయితే బడ్జెట్ ఎబ్భై కోట్లు దాటిపోతుంది. ఇక హీరోల రెమ్యునరేషన్ తో కలుపుకుంటే ఇంకా తడిసి మోపెడు అవుతుంది. మొన్నటి వరకు స్టార్ హీరోలు తమ క్రేజీని ఉపయోగించుకొని హిట్స్ బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేసేవారు. నిర్మాతలు కూడా హీరోలు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి డేట్స్ ఫిక్స్ చేసుకునే వారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోల ఆలోచన కూడా మారింది. రెమ్యునరేషన్ కంటే సినిమాలో షేర్ తీసుకుంటే బెటర్ అనే అభిప్రాయానికి వస్తున్నారు. 


ఈ నేపధ్యంలోనే ఇప్పుడు హీరోలు తాము హీరోలుగా తెరకెక్కిస్తున్న సినిమాలలో నిర్మాణ భాగస్వామిగా మారిపోయి తమ రెమ్యునరేషన్ ని బడ్జెట్ లో కేటాయించి సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన లాభాలలో వాటా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వలన అనుకున్న రెమ్యునరేషన్ కంటే రెట్టింపు సొమ్ము హీరోల ఖాతాలలో వచ్చి పడుతున్నాయి. సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న తాను పెట్టిన పెట్టుబడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే  ఈ పంథాని సూపర్ స్టార్ మహేష్ బాబు మొదలు పెట్టి తన సినిమాల ద్వారా అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 


ఇప్పుడు ఇదే దారిలో రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, నాని లాంటి హీరోలు కూడా నడవడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ తన ఫ్రెండ్స్ ప్రొడక్షన్ అయిన యూవీ క్రియేషన్స్ లో స్లీపింగ్ ప్రొడ్యూసర్ గా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ బ్యానర్ లో నిర్మించే ప్రతి సినిమాలో కూడా ప్రభాస్ భాగస్వామ్యం ఉంది. ఇక నాని కూడా ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి తన సినిమాలకి తాను నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక బాలీవుడ్ హీరోలైన అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ కూడా ఇదే పంథాలో వెళ్లి  లాభపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: