టైటానిక్, టెర్మినేటర్ వంటి అద్భుతమైన చిత్రాలు తీసిన జేమ్స్ కామెరూన్ నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం "అవతార్". 240 మిలియన్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజయ్యి ఘన విజయాన్ని సాధించడమే కాకుండా అప్పటి వరకు ఉన్నబాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టి ప్రపంచంలోనే ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రాల వరుసలో ప్రథమ స్థానంలో నిలిచింది.

 

అలాంటి చిత్రంలో లీడ్ రోల్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ బాలీవుడ్ నటుడు గోవిందా ఆ ఆఫర్ని తిరస్కారించాడట. వివరాల్లోకెళితే ఈ మధ్య ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవిందా మాట్లాడుతూ, తన సినీ ప్రస్థానంలో తిరస్కరించిన చిత్రాలలో అవతార్ కూడా ఉందని చెప్పాడు. జేమ్స్ కామెరూన్ అవతార్ లో లీడ్ క్యారెక్టర్ కి తనని అడిగాడట. కానీ దాన్ని గోవింద సున్నితంగా తిరస్కరించాడట.

 

కామెరూన్ విజన్ తనకి ఇంపాజిబుల్ గా అనిపించిందని, సినిమా పూర్తవడానికి ౭ సంవత్సరాల టైం పడుతుందని చెప్పడంతో, అంతకాలం తను వెయిట్ చేయలేనని, అదీ గాక షూటింగ్ జరిగినన్ని రోజులు బాడీ మొత్తం బ్లూ పేయింట్ వేసుకోవడం తనకి ఇష్టం లేక ఆ ఆఫర్ని తిరస్కరించాడట.కామెరూన్ కి అవతార్ అనే పేరును తానే సజెస్ట్ చేసానని చెప్పాడు.

 

90 వ దశకంలో బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించిన గోవిందా ఎక్కువగా కామెడీ చిత్రాల ద్వారా పేరు సంపాదించాడు. అతని డాన్సులకు యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. 2004 లో రాజకీయాల్లో

 

ప్రవేశించిన గోవిందా కాంగ్రెస్ పార్టీ నుండి ముంబయి నార్త్ కి ఎమ్ పి గా ఎన్నికయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: