అందరికి సహజంగా ఉండాల్సిన కోరిక స్టార్ హీరోయిన కాజల్ కు మాత్రం లేదట. పైగా ఆవిషయాన్ని కూడా కాజలే స్వయంగా చెప్పింది, అందుకే వారెవ్వా... కాజల్ అంటున్నారు సినిమావాళ్లు. సాధారణంగా ఏరంగంలో ఉన్నవారికైనా ఆ కోరిక ఉండడం సహజం, కాని కాజల్ కు అదే లేదంటే నిజంగా గ్రేట్ అంటున్నారు.

ఎవరికైనా వారు ఎంచుకున్న రంగంలో నెంబర్ వన్ కావాలనుకుంటారు, అందరి ముందు తమ సత్తా ఏంటో చూపించాలనుకుంటున్నారు. ఆమె తర్వాత సినిమాల్లోకి వచ్చిన సమంత, తమన్నా లాంటి వారే నెంబర్ వన్ కోసం చెమటోడ్చి కష్టపడుతున్నారు, కాని కాజల్ మాత్రం నాకు నెంబర్ వన్ కావాలని లేదని చెప్పింది.

నాకు చేతినిండా సినిమాలున్నాయి, నాకు తొందరతొందరగా చేసాయలనేంలేదు, నాకు నెంబర్ గేమింగ్ మీద ఆసక్తిలేదు అంది కాజల్. ఆమె నటించిన ‘ ఆల్ ఇన్ ఆల్ అళగురాజా’ దీపావలికి విడుదల కానుంది. ఈ సంధర్భంగా మాట్లాడుతూ గతంలో ఓసారి సినిమా చేసిన వారితో మరోసారి జోడి కట్టడం ఆనందంగా ఉంటుంది అని చెప్పింది కాజల్. కార్తి, విజయ్ లతో ఇంతకు ముందే సినిమాలు తీసాను, అవి రెండు హిట్టయ్యాయి, ఇప్పుడు మళ్లీ హిట్ కాంబినేషన్ నటిస్తున్నాను అని చెప్పింది కాజల్, అది కూడా హిట్టు అవుతుందన్న నమ్మకం ఉందట, బెస్టాఫ్ లక్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: