ఏ నటుడైన హీరో అనే ఇమేజ్ చట్రం లో చిక్కుకోకుండా ఎప్పుడైతే విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వాళ్ళనే పరి పూర్ణమైన నటుడు అంటాము. వాస్తవంగా చెప్పాలంటే మన సౌత్ ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు చాలా తక్కువనే చెప్పాలి. వాళ్ళలో కోలీవుడ్ లో విభిన్నమైన పాత్రలతో హీరోగా తన కంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకుని.. వరుస సినిమాలతో బిజీగా వున్న నటుడు విజయ్ సేతుపతి. కేవలం హీరో అనే ట్యాగ్ మాత్రమే తగిలించుకోకుండా.. ఎలాంటి ఛాలెంజింగ్ పాత్ర అయినా చెయ్యగలిగిన నటుడు. ఉదాహరణకు 96, ఈమధ్యనే వచ్చిన సూపర్ డీలక్స్ సినిమాలనే తీసుకోండి విజయ్ సేతుపతి లోని నటుడిని అందరూ ఇష్టపడే సినిమాలు అవి. ఇక కోలీవుడ్ లోనే కాదు.. తెలుగులో చిరు సైరా నరసింహారెడ్డి సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్న విజయ్ సేతుపతి.. మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ తేజ్ కోసం విలన్ అవతారమెత్తాడు. 

మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలలో అద్భుతమైన పాత్రలను దక్కించుకోవడమే కాదు ఆ పాత్రలకు న్యాయం చేస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ హీరోగా సుకుమార్ తమ్ముడు తెరకెక్కిస్తున్న ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి హీరోయిన్ ఫాదర్ కేరెక్టర్ లో విలన్ గా నటించడానికి ఒప్పుకుని టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ అందరికి షాకిచ్చాడు. ఉప్పెన సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. అయితే తాజాగా ఉప్పెన సినిమా నుండి విజయ్ సేతుపతి బయటకొచ్చాడనే టాక్ టాలీవుడ్‌ బాగా వినపడింది. అంతేకాదు ఇది సినిమాపై కూడా కాస్త ప్రభావం చూపించింది.

ఒకరకంగా విజయ్ సేతుపతి.. వైష్ణవ తేజ్ సినిమాలో విలన్ అనగానే ఉప్పెన సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి విజయ్ ఎందుకు ఈ సినిమా నుండి తప్పుకుంటున్నాడో అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. అయితే విజయ్ సేతుపతి ఉప్పెన సినిమా నుండి తప్పుకోలేదని.. అది కేవలం రూమరేనని... విజయ్ సేతుపతి ఉప్పెన సినిమా షూటింగ్ లో ఆగష్టు 16 నుండి పాల్గొననున్నాడని లేటెస్ట్ అప్‌డేట్. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న సైరా, ఉప్పెన సినిమాలలోని పాత్రలు గనక ప్రేక్షకులకు నచ్చితే ఇక టాలీవుడ్‌లో విజయ్ మరిన్ని మంచి పాత్రలు పొందే అవకాశం గట్టిగానే ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: