అత్తగారి దెబ్బకు మగధీరుడు అవుటయ్యాడు, ఆ పోటీలో బాబాయ్ పవన్ కళ్యాణ్ అబ్బాయి రాంచరణ్ పై తిరుగులేని విజయం సాధించాడు, అది కూడా మగధీర లైఫ్ టైం లో సాదించిన కలెక్షన్లను కేవలం 26 రోజుల్లోనే అదిగమించి ఇంకా అదిరిపోయే రికార్డు దిశగా ‘అత్తారింటికి దారేది’ దూసుకుపోతోంది.

మగధీర తన పూర్తి కాలంలో ఏపిలో 61.60 కోట్లు కలెక్షన్లు సాదించగా, ప్రపంచ వ్యాప్తంగా మరో 11.50 కోట్లు కలెక్షన్లు సాధించింది. కాని ‘అత్తారింటికి దారేది’ కేవలం 26 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 73.28 కోట్లు సంపాదించి ఆల్ టైం రికార్డు బ్రేక్ చేసింది.

పవన్ హీరోగా, సమంత, ప్రణీతలు హీరోయిన్లుగా, అదిరిపోయే హాస్యంతో బ్రహ్మానందంలు నటించిన ఈ సినిమాలో తాజాగా మరికొన్ని కొత్త సీన్లు కూడా కలిపి ప్రదర్శించాలని నిర్ణయించారు. దీంతో కలెక్షన్లు మరింత భారీగా పెరిగి ఎవరు అందుకోలేనంత స్తాయికి చేరి తెలుగుహీరోలందరికి పెద్ద సవాల్ విసురుతుంది ఈ సినిమా అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: