స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానుల గ్రూప్ ను ప్రోత్సహిస్తున్నాడు అన్న విషయం గత కొద్ది కాలంగా ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులుగా నడుస్తూనే ఉంది. అయితే బన్నీ పై వస్తున్న ఈ వార్తలకు నిన్న స్పష్టమైన క్లారిటీ వచ్చింది.

మెగా అభిమానుల అండతో ఎదిగిన అల్లు అర్జున్ తన పేరు మీద ఏర్పాటు చేయబడ్డ ‘అల్లు అర్జున్ ఆర్మీ’ ని ప్రోత్సహిస్తున్నాడు అన్న విషయం నిన్న మరొకసారి రుజువైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ షూటింగ్ కోసం కాకినాడ వెళ్ళినప్పుడు అతడికి అక్కడ అభిమలతో ఘనమైన స్వాగతం లభించడమే కాకుండా ఎక్కడ చూసినా ‘అల్లు అర్జున్ ఆర్మీ’ పేరుతో ఫ్లాగ్స్ కనిపించాయి.

వైట్ కలర్ బ్యానర్ పై రెడ్ లెటర్స్ తో ప్రింట్ చేయబడ్ద్ ఈ ‘అల్లు అర్జున్ ఆర్మీ’ ఫ్లాగ్స్ మోడల్ చూస్తే అచ్చు ‘జనసేన’ జెండాలులా దూరానికి కనిపిస్తాయి. కానీ ఆ జెండాలు అన్నీ అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో నిండిపోయాయి. తూర్పు గోదావరి జిల్లా ప్రాంతాలలో కాపు సామాజిక వర్గ యూత్ అనేకమంది ఉంటారు. సాధారణంగా వారంతా చిరంజీవి పవన్ ల వీరాభిమానులు. ‘జనసేన’ పార్టీ ఓడిపోయినా తూర్పుగోదావరి జిల్లాలో ఓట్ల శాతం బాగా వచ్చింది. 

ఇలా మెగా ఫ్యామిలీకి మంచి పట్టు ఉన్న ప్రాంతంలో ఎక్కడ చూసినా ప్రతి అభిమాని చేతిలో అల్లు అర్జున్ ఆర్మీ ఫ్లాగ్ కనిపించడం ఒక విధంగా మెగా కాంపౌండ్ కు షాక్ ఇవ్వడమే కాకుండా ఈ ఫ్లాగ్స్ వ్యవహారం దేనికి సంకేతం అంటూ మెగా ఫ్యామిలీ హీరోలు ఈ విషయాన్ని చాల లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ చాల వ్యూహాత్మకంగా మెగా కాంపౌండ్ కు దూరం జరిగాడు అని వార్తలు వస్తున్న నేపద్యంలో ఈ ఫ్లాగ్స్ వ్యవహారం ఇండస్ట్రీలో కూడ హాట్ టాపిక్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: