2019 సెకండాఫ్లో భారీ బడ్జెట్, భారీ అంచనాలతో విడుదల కాబోతున్న మొదటి సినిమా సాహో. ఆగష్ట్ 30 వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. గత రెండు రోజుల నుండి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న ప్రభాస్ ప్రీ రిలీజ్ బిజినెస్లో 50% తన రెమ్యూనరేషన్ క్రింద తీసుకుంటున్నాడని, 150 కోట్ల దాకా ప్రభాస్ కు ఈ సినిమాతో రెమ్యూనరేషన్ వస్తుందని, భారతీయ సినిమా చరిత్రలోనే ఇప్పటిదాకా ఇంత రెమ్యూనరేషన్ ఎవరూ తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి. 
 
మరి ప్రభాస్ నిజంగా అంత తీసుకుంటున్నాడా అనే ప్రశ్నకు సమాధానం ప్రభాస్ అంత తీసుకోవట్లేదనే చెప్పాలి. ఎందుకంటే సాహో సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ రెమ్యూనరేషన్ కాకుండానే ఈ సినిమాకు 200 కోట్ల రుపాయల బడ్జెట్ అయినట్లు తెలుస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ 250 కోట్ల నుండి 300 కోట్ల దాకా జరిగే అవకాశం ఉంది. మరి ప్రభాస్ కే ప్రీ రిలీజ్ బిజినెస్లో 50% రెమ్యూనరేషన్ క్రింద ఇస్తే నిర్మాతలు నష్టపోతారు. 
 
బాహుబలి 1, బాహుబలి2 సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అవ్వడంతో ప్రభాస్ మార్కెట్ పెరిగింది. ఆ మార్కెట్ ఏ మేరకు పెరిగిందనే విషయం మాత్రం సాహో సినిమా విడుదల అయ్యాకే తెలుస్తుంది. సాహో సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ భారీగానే ఉందని కానీ మరీ ప్రీ రిలీజ్ బిజినెస్లో 50% ఇచ్చేంత కాదని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్ శ్రధ్ధా కపూర్ ఈ సినిమాకు 9 కోట్ల రుపాయలు తీసుకుంటుందని తెలుస్తోంది. 
 
విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా మొదట ఆగష్ట్ 15 న విడుదల కావల్సిన సాహో సినిమా ఆగష్ట్ 30 వ తేదీకీ మారింది. ఈ సినిమా మరలా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నా నిర్మాతలు మాత్రం ఆగష్ట్ 30 వ తేదీనే విడుదల కాబోతుందని చెబుతున్నారు.ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: