రకుల్ ప్రీత్ సింగ్. పొడగరి. సొగసరి. గడసరి కూడా.  ఈ అమ్మడు తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో ఎంట‌రైంది. ఆ వూపు అలా ఇలా లేదు. యంగ్ హీరోలంతా రకుల్ తోనే జట్టు అన్నంతగా టాప్ లెవెల్లో వెలిగిపోయింది. ఇపుడున్న కుర్ర హీరోలందరి పక్కన మెరిసి సరైన జోడీ అనిపించుకుంది. సినిమాలు హిట్ అయితే హీరోలు, ఫ్లాప్ అయితే  హీరోయిన్లు, డైరెక్టర్లు ఇదీ  ఇపుడు నడుస్తున్న ట్రెండ్. దానికి రకుల్ కూడా బలి అయిపోయింది. ఆమె మూవీస్ హిట్ కాకపోవడంతో పక్కన పెట్టేశారు


సరిగ్గా ఇక్కడే రకుల్ పెద్ద తప్పు చేసిందంటున్నారు.   తనను తాను ప్రూవ్ చేసుకునే క్రమంలో ఆమె యాభై,  అరవై ఏజ్ ఉన్న హీరోలు  అజయ్ దేవగన్, నాగార్జున పక్కన నటించింది. బాలీవుడ్లో  దే దే ప్యార్ దే మూవీలో ఎంత బోల్డ్ గా నటించిన ఫలితం దక్కలేదు  ఇక ఇపుడు టాలీవుడ్లో మన్మధుడు 2 అంటూ అక్కినేని నాగ్ సరసన‌ నటిస్తోంది. ఇందులోనూ పొట్టి డ్రెస్సులతో కాస్తా మసాల టైప్ లోనే రకుల్ కనిపిస్తోంది.


ఇక ఈ మూవీ హిట్ కోసం రకుల్ సీరియస్ గానే వెయిట్ చేస్తోంది. అయితే ఈ మూవీ హిట్ అయినా రకుల్ అనుకున్న ఆశలు నెరవేరవు అంటున్నారు ఫిల్మ్ క్రిటిక్స్. ఎందుకంటే రకుల్ ఎపుడైతే సీనియర్ల పక్కన నటించిందో అప్పటి నుంచి ఆమె సీనియర్ హీరోయిన్ బ్రాండ్ ని తనకు తానే తగిలించేసుకుంది. దాంతో ఆమె మళ్ళీ కుర్ర హీరోల పక్కన నటించే అవకాశలైతే లేవనే అంటున్నారు. మరి రకుల్ కి ఈ మూవీ హిట్ అయితే మరో సీనియర్ హీరో పక్కన పెయిర్ గా చాన్స్ వస్తుందేమో కానీ యంగర్ జనరేషన్ మాత్రం ఆమెను అసలు  పిలవరని అంటున్నారు 


నిండా ముప్పయి ఏళ్ళు లేని రకుల్ హిట్ల కోసం ఇలా ఓ పెద్ద తప్పు చేయడం వల్ల ఆమె సీనియర్ గా బ్రాండ్ వేయించేసుకుందని అంటున్నారు. మరి రకుల్ చేయాల్సింది ఏమైనా ఉందా అంటే ఓ విధంగా కెరీర్ క్లోజేనని అనేస్తున్నారు. ఈ మూవీ హిట్ అయినా ఆఫర్లైతే రావు. అందువల్ల రకుల్ చిరంజీవి, బాలయ్య, వెంకీల పక్కన నటించేందుకు ప్రిపేర్ అయితే కొన్ని సినిమాలు అయినా వస్తాయి. లేకపోతే ఖేల్ ఖతం అంటున్నారు. పాపం రకుల్ రాంగ్ డెసిషన్ అని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: