బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో మొదలై రెండో వారం కూడా పూర్తి కావొస్తుంది. 15 మంది కంటెస్టంట్స్ ఉన్న ఈ షోలో మొదటి వారం హేమ ఎలిమినేట్ అవగా ఆమె స్థానంలో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రిని హౌజ్ లోపలకు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపించారు. ఈ వారం కూడా హౌజ్ నుండి 8 మంది నామినేట్ అయ్యారు.


షో మొదలైన దగ్గర నుండి ఇంటి సభ్యుల మధ్య గొడవలను చూస్తూనే ఉన్నాం 10వ రోజు అనగా నిన్న బుధవారం కూడా బిగ్ బాస్ ఇచ్చిన లక్సరీ బడ్జెట్ టాస్క్ లో గొడవలతో సాగింది. ఇక ఈ టాస్క్ లో వరస్ట్ పర్ఫార్మర్ గా వరుణ్ సందేశ్, తమన్నా సింహా ద్రి ఉన్నారు. అయితే వాళ్లిద్దరిని జైలులో ఉండాలని ఆదేశాలిచ్చాడు బిగ్ బాస్.


మళ్లీ బిగ్ బాస్ తదుపరి ఆదేశం ఇచ్చే వరకు వరుణ్, తమన్నా ఇద్దరు జైలులోనే ఉండాలని అన్నారు. ఇక షోకి అనుకున్న క్రేజ్ రాగా దాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే జబర్దస్త్ క్రేజీ కమెడియన్ సుడిగాలి సుధీర్ ను హౌజ్ లోకి పంపించాలని చూస్తున్నారు. ఏంటి సుధీర్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తాడా అంటే అలా కాదు కాని తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చి సుధీర్ హౌజ్ లో సందడి చేస్తాడని అంటున్నారు.


సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సుధీర్ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్తాడని తెలుస్తుంది. బిగ్ బాస్ హౌజ్ లో సినిమా ప్రమోషన్స్ భారీగా జరుగుతాయి. ముందు రెండు సీజన్లలో కూడా హౌజ్ లోకి కొందరు సెలబ్రిటీస్ వచ్చి సందడి చేశారు. ఈ క్రమంలోనే సుధీర్ కూడా వచ్చి హౌజ్ లో తన టాలెంట్ చూపిస్తాడట. తనకు వచ్చిన మ్యాజిక్ షో కూడా హౌజ్ లో ప్రదర్శిస్తాడని తెలుస్తుంది. మరి హౌజ్ లోకి సుధీర్ ఎప్పుడు వస్తాడు.. అసలు వస్తాడా రాడా అన్న విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: