ప్రేమ గుడ్డిది అన్న నానుడి చాలా సందర్భాల్లో నిజం అయింది. ఇప్పుడు ఇది మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ విషయంలో కూడా మరోసారి రుజువు కానుంది. 1994 లో మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కిరీటాలు సాధించిన సుస్మితాసేన్ పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన భారీ బడ్జెట్ సినిమా చేసింది రక్షకుడులోనూ నాగార్జునతో రొమాన్స్ చేసింది. ఆతర్వాత జె.డి.చక్రవర్తి మర్రిచెట్టు సినిమాలో కూడా నటించింది.


42 సంవత్సరాల సుస్మిత ఇప్పటికే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. చాలా లేట్ వయసులో సుస్మితా పెళ్లికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రొహ్మన్ చావల్ అనే మోడల్ తో గత కొన్నేళ్లుగా ఆమె సహజీవనం చేస్తున్నారు. కాగా తాజాగా వీరిద్దరూ తమ బంధాన్ని పెళ్లితో ముగింపు ఇవ్వ‌నున్నార‌ట‌. ఓ ఫ్యాషన్ షోలో కలిసిన వీరిద్దరూ ప్రేమలో పడ్డారట. 


ఫ్యాష‌న్ షోలో కలుసుకుని ప్రేమ‌లో ప‌డిన‌ప్ప‌టి నుంచి ఎక్క‌డ చూసినా ఈ జంటే చ‌క్కెర్లు కొట్టేది. గ‌త కొన్ని రోజులుగా సుస్మిత - రోహ‌న్‌ జంట విందులు,విహారాలంటూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. దీనితో కొద్దిరోజులుగా వీరిబంధం పై మాధ్యమాలలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు వీరు పెళ్లికి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లో త‌క్కువ వ‌య‌స్సు ఉన్న వారిని పెళ్లి చేసుకోవ‌డం హీరోయిన్ల‌కు కొత్తేం కాదు. ఐశ్వ‌ర్యారాయ్ - అభిషేక్‌బ‌చ్చ‌న్ దంప‌తుల‌తో పాటు సైఫ్ ఆలీఖాన్‌, అమృతా ఆరోరా దంప‌తులు కూడా ఇలాగే పెళ్లి చేసుకున్నారు.


వీరిద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం విచిత్రం కాక‌పోయినా సుస్మిత కంటే రోహ‌న్ చాలా చిన్న‌వాడు. సుస్మిత వ‌య‌స్సు 42 సంవ‌త్స‌రాలు. రోహ‌న్ ఆమె కంటే ఏకంగా 14 సంవ‌త్స‌రాలు చిన్న‌వాడు. ప్ర‌స్తుతం రోహ‌న్ వయ‌స్సు 28 సంవ‌త్స‌రాలు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ నెలలో ఈ జంట పెళ్లి పీటలెక్కే అవకాశం కలదు.



మరింత సమాచారం తెలుసుకోండి: