సౌత్ సిని పరిశ్రమలో దశాబ్ధ కాలంగా తన అందం అభినయంతో ఆకట్టుకుంటుంది కాజల్ అగర్వాల్. లక్ష్మి కళ్యాణం సినిమా నుండి ఈమధ్యనే వచ్చిన సీత వరకు కాజల్ హిట్లు ఫ్లాపులతో కెరియర్ సాగిస్తుంది. మూడేళ్ల క్రితం అమ్మడి కెరియర్ ముగింపుకు వచ్చినట్టే అనిపించగా సీనియర్ స్టార్ హీరోస్ కు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించడంతో వరుస అవకాశాలు వచ్చాయి.   


స్టార్ హీరోలతోనే కాదు యువ హీరోలతో కూడా జోడీ కడుతుంది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కోలీవుడ్ లో ఇండియన్ 2, జయం రవి 'కోమాలి' సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు తెలుగులో శర్వానంద్ హీరోగా వస్తున్న రణరంగం సినిమాలో నటిస్తుంది. కెరియర్ మంచి జోష్ లో ఉన్న కాజల్ ఇప్పుడు వెబ్ సీరీస్ లకు ఓకే చెబుతుందట.   


తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఓ వెబ్ సీరీస్ రాబోతుందట. ఈ వెబ్ సీరీస్ లో కాజల్ నటించబోతుందని టాక్. ఈమధ్య వెబ్ సీరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. అమేజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ ఫ్లాట్ ఫాంల వల్ల సినిమాలను తీయలేని కథలను వెబ్ సీరీస్ ల రూపంలో తీస్తున్నారు.


ఇప్పటికే పలు హీరోయిన్స్ అటు సినిమాలు చేస్తూనే వెబ్ సీరీస్ లు చేస్తున్నారు. వారి దారిలోనే కాజల్ కూడా వెబ్ సీరీస్ లో నటించేందుకు రెడీ అయ్యింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని బాగా ఫిక్స్ అయినట్టు ఉంది కాజల్ అందుకే వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవట్లేదు. తీసేది వెబ్ సీరీస్ అయినా రెమ్యునరేషన్ మాత్రం సినిమాకు డిమాండ్ చేసినట్టే చేస్తుందట. తెలుగులో కాజల్ నటించిన రణరంగం సినిమా ఆగష్టు 15న రిలీజ్ అవుతుంది. సుధీర్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.     



మరింత సమాచారం తెలుసుకోండి: