రియల్ మీద హీరోయిన్‌ను ప్రేమించిన హీరో రియల్ లైఫ్ లోనూ అదే హీరోయిన్ తో ప్రేమలో పడిపోయాడు. ప్రేమ‌లో ప‌డ్డాడు అనేకంటే ప్రేమ‌పేరుతో వేధిస్తున్నాడన్న ఆరోప‌ణ‌లే వ‌స్తున్నాయి. రీల్ లైఫ్ లో హీరోయిన్ ని ప్రేమ పేరుతో టార్చర్ పెట్టడంలో తప్పులేదు గాని... రియల్ లైఫ్ లో కూడా తన సినిమాలో నటించిన హీరోయిన్‌ను అలా వేధిస్తే పెద్ద సంచలనమే అవుతుంది. ఇప్పుడు కోలీవుడ్లో ఇదే విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ లో ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఓ సినిమాలో హీరోగా నటించిన నటుడు తన కుమార్తెను ప్రేమ పేరుతో టార్చర్ పెడుతున్నాడు అంటూ ఆ సినిమాలో హీరోయిన్‌గా చేసిన అమ్మాయి తల్లి మీడియా ముందుకు వచ్చి వాపోయింది.


దర్శకుడు బాలా శిష్యుడు నందన్‌ సుబ్బరాయన్‌ మొదటిసారి డైరెక్టర్ అవతరమెత్తి మయూరన్‌ అనే సినిమా చేశాడు. బాలా శిష్యుడు డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతుండ‌డంతో ఈ సినిమాపై అక్క‌డ మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాలో అముదవానన్‌ హీరోగానూ, మిస్‌ ఇండియా (ఫెమీనా) కిరీటాన్ని గెలుచుకున్న అశ్మిత హీరోయిన్‌గానూ నటించారు. శుక్రవారం తెరపైకి రానున్న ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఆశిస్తోన్న దృష్ట్యా చిత్ర నిర్మాత‌లు భారీ ఎత్తున ప్ర‌మోష‌న్లు చేస్తున్నారు. 


నిర్మాత‌ల‌కు షాక్ ఇస్తూ ఈ సినిమా ప్రమోషన్‌కు హీరోహీరోయిన్లు ఇద్దరూ హాజరు కాలేదు. హీరో వస్తే తన కూతురు రాదని ఆమె తల్లి నిర్మాతలకు చెప్పింది. త‌న కుమార్తె కోటీశ్వ‌రురాల‌ని ఆమెను ప్రేమ పేరుతో ట్రాప్ చేసేందుకు హీరో అముదవానన్‌ ప్రేమ పేరుతో టార్చర్‌ చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన అశ్మిత త‌ల్లే స్వ‌యంగా ఇలా మీడియా ముందుకు వ‌చ్చి హీరోపై ఫిర్యాదు చేయ‌డంతో ఇండస్ట్రీ అంతా ఈ విష‌యం ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది.


ఈ కార‌ణంతోనే హీరోయిన్ అశ్మిత ప్ర‌మోష‌న్‌కు కూడా రాలేదు. హీరోయిన్ సినిమా ప్ర‌మోషన్‌కు హీరోయిన్‌ రాకపోతే తానెందుకు రావాలని హీరో మొండికేస్తున్నాడని చిత్ర దర్శక నిర్మాతలు ఆరోపణలు చేస్తున్నారు. రిలీజ్‌కు టైం ద‌గ్గ‌ర ప‌డింది. ఇప్పుడు హైప్ కోసం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేస్తే హీరో, హీరోయిన్లు రాన‌ని మెండికేస్తుండ‌డంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: