టిక్‌టాక్ ఫేమ్ ఉప్పల్ బాలుకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ జెమినీ నగర్‌లో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొనగా.. ఓ ఆకతాయి బాలు పట్ల దురుసుగా ప్రవర్తించాడు. గుంపులో నిలబడి బాలు నెత్తిపై వెనుక నుంచి రెండుసార్లు కొట్టి ఏమీ ఎరగనట్టు నిలుచుండిపోయాడు.


అయితే బాలు పక్కనున్న వ్యక్తులు అతన్ని గమనించి వారించారు. ఆకతాయి చేసిన పనికి బాలు కోపోద్రిక్తుడైనప్పటికీ.. ఏమీ అనకుండా సైలెంట్‌ గానే ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టిక్‌టాక్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న ఉప్పల్ బాలు.. బిగ్‌బాస్ హౌజ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 


అయితే అలాంటిదేమీ లేదని ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో అతను వెల్లడించాడు. ఇదిలా ఉంటే,టిక్‌టాక్ మోజులో ప్రభుత్వ ఉద్యోగులు పనులు సైతం పక్కనపెట్టి వీడియోలు చేస్తూ దొరికిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే ఉప్పల్ బాలు మాత్రం టిక్‌టాక్ తనకు ఓ గుర్తింపునిచ్చిందని.. బతకుదెరువునిచ్చిందని చెబుతున్నాడు. టిక్‌టాక్ వల్లే పలు టీవీ సీరియల్స్,రియాలిటీ షోలు చేస్తున్నానని చెబుతున్నాడు. ఉప్పల్ బాలు ఆడపిల్లల డ్రెస్సులు వెస్కొని టిక్ టాక్ చెయ్యడం, బయట కూడా గొంతు మర్చి ఆడవాళ్లలా మాట్లాడడం అందరికి తెలిసిందే. ఇంకొంతమంది అయితే, తాను 'గే' అని ఒప్పుకొని మిగితా గే లకి స్ఫూర్తి గ నిలవాలని కామెంట్ చేసారు.


అదే ఇంటర్వ్యూ లో ఉప్పల్ బాలు ని అడిగిన ప్రశ్నలకు ఫైర్ కూడా అయ్యాడు. తన సెక్సువాలిటీ గురించి, తాను 'గే' అన్న మాట నిజమేనా అని అడిగిన ప్రశ్నకు ఉప్పల్ బాలు మండిపడుతూ, 'ఇలాంటి ప్రశ్నలు అడగకండి' అని విరుచుకుపడ్డాడు. అయితే దీనికి సోషల్ మీడియా లో reactions  విపరీతంగా వచ్చాయి. నువ్వు అలాంటి చేష్టలు చేస్తునందుకే అలాంటి ప్రశ్నలు అడగవలసి వస్తోందని కామెంట్స్ కూడా వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: