హృదయ కాలేయం సినిమాతో సంపూర్ణేష్ బాబు రాత్రికి రాత్రే బాగా పాపులర్ అయిపోయాడు. అంతేకాదు నాలుగైదు సినిమాలు సూపర్ హిట్టైతే గానీ పేరు పక్కన ఏదో ఒక స్టార్ అని తగిలించుకుంటారు. కానీ సంపూ మాత్రం మొదటి సినిమాతోనే బర్నింగ్ స్టార్ గా ఫుల్ ఫేమస్ అయిపోయాడు. ఆకారం ఎలా ఉన్నా వికారం లేకుండా ప్రేక్షకులను తన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులనే కాదు దర్శక ధీరుడు రాజమౌళి నే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరినీ బాగా ఆకట్టుకున్నాడు. అందుకే ఈసారి ఒక్కొక్కరిని ‘కొబ్బరి మట్ట’ తో గట్టిగా కొట్టాలని సంపూర్ణేష్ బాబు ఫిక్స్ అయ్యాడు. 

ప్రోమోషన్స్ కి తనదైన శైలిలో వైవిధ్యంగా నిర్వహిస్తూ సినిమాకి ఎవరు ఊహించని ప్రచారం కల్పిస్తున్నాడు. ఇటీవల వరల్డ్ రికార్డ్ ట్రైలర్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో ఒక్కసారిగా గుక్క తిప్పుకోకుండా మూడున్నర నిమిషాల డైలాగ్ చెప్పి ఆశ్చర్య పరిచాడు. బహుషా ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద డైలాగ్ ఏ హీరో చెప్పి ఉండరేమో. అదే సంపూ స్టైల్ మరి. ఇక తాజాగా ప్రేక్షకులకు ఓ కాంటెస్ట్ పెట్టి, ప్రైజ్ మనీ కూడా ప్రకటించేశాడు. లేట్‌గా వచ్చినా లేటెస్ట్ గా అందరికంటే పెద్ద హిట్ కొట్టాలనే కసి సంపూలో కనబడుతుంది.

ఠాగూర్, ఇంద్ర లాగా ‘కొబ్బరిమట్ట’ సినిమాలోని డైలాగ్ కానీ, పాటను కానీ, లేక ఓ డాన్స్ మూవ్ మెంట్ కానీ పెర్ఫార్మ్ చేసి, ఆ వీడియోని కొబ్బరిమట్ట కాంటెస్ట్ యష్ టాగ్ తో సోషల్ మీడియా ద్వారా లేదా మెయిల్ ద్వారా వారికి పంపాలని ప్రకటించాడు. అలా పంపిన వారిలో నలుగురు విజేతలకు ప్రైజ్ మనీ అందిస్తారట. ఇందుకోసం రీసెంట్‌గా సంపూ  టీమ్ ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఇలాంటి కొత్త రకమైన ఆలోచనలతో సంపూ తన సినిమాను బాగానే జనాల్లోకి తీసుకెళుతున్నాడు. ఇలాంటి ప్రమోషన్స్ చేయాలనే ఆలోచన ప్రస్తుతం ఏ యంగ్ హీరోకి రాలేదంటే సంపూ ఏంటో అర్థమవుతోంది. మొత్తానికి ఈ సారి సంపూ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించడం ఖాయం.  ఇక రూపక్ రోనాల్డ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, షకీలా, కత్తి మహేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: