నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్‌గా 118 సినిమాతో మంచి డీసెంట్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. చాలాకాలం తర్వాత కళ్యాణ్ రామ్ ఖాతాలో ఓ హిట్ పడింది. ఈ సినిమా తర్వాత శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేష్న దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 118 వంటి థ్రిల్లర్ తర్వాత నటిస్తున్న ఫ్యామిలీ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ లో నటిస్తున్నట్లు లేటెస్ట్ అప్‌డేట్. డైరెక్టర్ సంపత్ నందికి కామెడీ రాయడంలో మంచి పట్టు ఉంది.అయితే సంపత్ నంది ఇప్పటికే కళ్యాణ్ రామ్ కోసం ఓ మంచి కామెడీ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. 

త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కెనున్నట్లు సమాచారం. అయితే పటాస్ తర్వాత కామెడీ సినిమాలు పెద్దగా చేయని కళ్యాణ్ రామ్, సంపంత్ నంది సినిమాలో మాత్రం పక్కా కామెడీ బ్యాగ్డ్రాప్ లో హైలెట్ అయ్యే విధంగా సినిమాని చేయనున్నాడట. మరి ఎక్కువుగా సీరియస్ పాత్రలు చేసే కళ్యాణ్ రామ్ ఫుల్ ఎంటర్ టైనర్ లో ఫుల్ కామెడీ రోల్ లో ఇంతవరకూ చెయ్యలేదు. అయితే పటాస్ ద్వారా తనకు మంచి కామెడి టైమింగ్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా పెద్ద కమర్షియల్ సక్సస్ ను సాధించింది.

అందుకే సపంత్ నంది సినిమాలో ఫుల్ ఫన్ రోల్ ను కళ్యాణ్ రామ్ మొదటిసారి ట్రై చేస్తూన్నాడు. సపంత్ నంది కూడా హీరో పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని…సినిమా మొత్తం మీద కళ్యాణ్ రామ్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉండేలా చూసుకున్నారని తెలుస్తోంది. ఆ పాత్రలోని వేరియేషన్స్ వల్లే సినిమాలో కామెడీ సీక్వెన్స్ బాగా హైలెట్ గా నిలుస్తాయట. మరి కళ్యాణ్ రామ్ – సంపత్ నంది కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి మంచి హిట్ ఇస్తోందా…చూడాలి. ఒకవైపు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు పేపర్ బాయ్ వంటి వినూత్నమైన కథలతో సినిమాలను నిర్మిస్తున్నాడు సంపత్ నంది. అంతేకాదు మరో సారీ గోపీ చంద్ ను డైరెక్ట్ చేయబోతున్నాడని ఇన్‌సైడ్ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: