పూరి జగన్నాధ్    రామ్ కాంబినేషనల్ లో సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు ఎవరికీ లేవు. ఎందుకంటే పూరి అప్పటికే అరడజను ప్లాప్స్ తీసి ఎక్కడికో పడి పోయారు. ఇక రామ్ పరిస్థితి కూడా ఇంచు మించు అలానే ఉండింది. ఇష్మార్ట్ శంకర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇది కూడా పూరీ పాత సినిమా మాదిరిగానే ఉందని చాలా మంది సినీ ప్రేమికులు పెదవి విరిచారు. 


అయితే సినిమా విడుదలై హిట్ టాక్ రెచ్చుకున్నాక ఇష్మార్ట్ కు ఇక తిరుగు లేకపోయింది. బి, సీ సెంటర్ లో అయితే ఈ సినిమాకు బ్రహ్మ రధం పడుతున్నారు. రామ్ కొత్త లుక్ భాషా మొత్తం మారిపోయి ఒక కొత్త రామ్ ను పరిచయం చేసినట్టుంది ఈ సినిమాలో దీనితో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా 30 కోట్లు షేర్ ను కొల్లగొట్టినట్టు సమాచారం. సుమారు 60 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అయితే లాస్ట్ వీక్ లో డియర్ కామ్రేడ్ సినిమా విడుదలయిన ఈ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో ఇష్మార్ట్ కు ఇక ఎదురు లేకుండా పోయింది. 


అయితే ఇష్మార్ట్ బ్లాక్ బస్టర్ అయినా పూరీకి పెద్ద హీరోలు అవకాశాలు ఇస్తారంటే డౌటే అని చెప్పాలి. పూరికి అప్పుడప్పుడు హిట్ సినిమాలు తీయడం కొత్తేమి కాదు. ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా తీసి హిట్ కొట్టారు. తరువాత వెంటనే జ్యోతిలక్ష్మి సినిమా రూపంలో పెద్ద ప్లాప్ ను ఇచ్చారు. ఇక అక్కడ నుంచి చాలా ప్లాప్ మూవీస్ తీసారు. ఆ ప్లాప్స్ అన్నింటిని మరిచిపోయే రేంజ్ లో ఇష్మార్ట్ శంకర్ సినిమా లేదని చెప్పాలి. విజయ దేవరకొండతో పూరీ సినిమా ఉంటుందని ఆ మధ్య టాక్ వచ్చింది. కానీ అదేమీ నిజం కాదని విజయ దేవరకొండ కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే రామ్ చరణ్. ప్రభాస్, చిరంజీవి వీరందరూ సినిమా బాగుందని మెచ్చుకున్న వీరెవరూ కూడా పూరికి అవకాశాలు ఇచ్చే మాదిరిగా కనిపించడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: