రామాయణం కావ్యాన్ని ఇప్పటి వరకు ఎందరో సినిమాలుగా తీశారు.  ఒక్కొక్కరు ఒక్కోరకంగా రామాయణాన్ని సినిమాగా చిత్రీకరించారు.  మోడ్రన్ కాలంలో ఎవరు రామాయణం జోలికి వెళ్లడం లేదు.  ఇప్పుడు దీన్ని సినిమాగా తీయాలి అంటే భారీ ఖర్చు అవుతుంది.  గ్రాఫిక్స్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయాలి.  అది సామాన్యమైన విషయంలా కనిపించడం లేదు.  అందుకే చాలామంది అనుకున్నాయా ఆ తరువాత డ్రాప్ అయ్యారు.  


ఇప్పుడు రామాయణం ను  సినిమాగా  తీసేందుకు అల్లు అరవింద్, మరో ప్రొడ్యూసర్ కలిసి సినిమాను  నిర్మించాలని అనుకుంటున్నారు.  ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు.  కానీ, ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. సినిమా కథకు సంబంధించిన పనులను చాలా వరకు పూర్తి చేశారని తెలుస్తోంది.   ఈ మూవీని మూడు భాగాలుగా తీయాలని ప్లాన్ చేస్తున్నారు.  


అది పూర్తిస్థాయి గ్రాఫిక్స్ తో, 3డి మూవీగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.  ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.  సినిమాను ప్రకటించారుగాని, ఇందులో ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని బయటపెట్టడం లేదు.  దాదాపు రూ. 1500 కోట్ల రూపాయల ఖర్చుతో సినిమా తెరకెక్కుతోంది.  రామ్ చరణ్ ను హీరోగా అనుకున్నా, చరణ్ దీనికి దూరంగా ఉంటానని చెప్పడంతో హీరోగా ఎవరిని తీసుకుంటారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.  


గతంలో మలయాళంలో మోహన్ లాల్ భీముడి పాత్రతో వెయ్యి కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తారని చెప్పారు.  కానీ,  ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.  కొన్ని  కారణాల వలన సినిమాను చేయడం లేదని తరువాత ప్రొడ్యూసర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.  మరి అల్లు అరవింద్ రామాయణం కూడా  అదే విధంగా జరుగుతుందా లేదంటే సెట్స్ మీదకు వెళ్తుందా చూడాలి. అల్లు అరవింద్  ప్రస్తుతం బన్నీ సినిమాకు ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు.  త్రివిక్రమ్ తో సినిమా తెరకెక్కుతోంది.  దీని తరువాత మెగాస్టార్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమాకు కూడా అల్లు అరవింద్ నిర్మాతగా  వ్యవహరించబోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: