రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఆర్ ఆర్ ఆర్ సినిమాను బాహుబలి సినిమా నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించాలని భావించారు. కానీ దర్శకుడు రాజమౌళి గతంలో డీవీవీ దానయ్య దగ్గర అడ్వాన్స్ తీసుకోవటంతో డీవీవి దానయ్యతో సినిమా చేయాల్సి వచ్చింది. 
 
కానీ రాజమౌళి గారికి శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని అంటే ఎంతో అభిమానం. రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాద రామన్న, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలకు వీరే నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ నిర్మాతలు ఆర్ ఆర్ ఆర్ సినిమా తాము నిర్మిస్తామని నిర్మాత డీవీవీ దానయ్యకు 100 కోట్ల రుపాయలు ఇస్తామని చెప్పారు. కానీ నిర్మాత దానయ్య ఈ నిర్మాతలు ఇచ్చిన ఆఫర్ తిరస్కరించాడు. 
 
కానీ రాజమౌళి శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇద్దరికీ మేలు చేకూర్చేలా ఒక నిర్ణయానికి వచ్చాడని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా హక్కులు ఎవరికీ అమ్మవద్దని ఆ సినిమా హక్కుల్లో మెజారిటీ హక్కులు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనికే విక్రయించాలని నిర్మాత దానయ్యను రాజమౌళి కోరాడని, దానయ్య కూడా రాజమౌళి నిర్ణయానికి అంగీకారం తెలిపాడని తెలుస్తుంది. 
 
సీడెడ్, కర్ణాటక ఏరియా హక్కులు మాత్రం ఈగ సినిమా నిర్మించిన సాయి కొర్రపాటికి ఇవ్వమని రాజమౌళి దానయ్యను కోరాడని తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. మెగా, నందమూరి ఫ్యామిలీలకు చెందిన స్టార్ హీరోలు నటిస్తుండటం,రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా 2020 జులై 30 వ తేదీన విడుదల కాబోతుంది 



మరింత సమాచారం తెలుసుకోండి: