టాలీవుడ్ యువ హీరోల్లో ప్రస్తుతం సంచలన నటుడిగా యువత హృదయాలు కొల్లగొడుతూ ముందుకు సాగుతున్న నటుడు విజయ్ దేవరకొండ. మొదట అక్కడక్కడా కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిసిన విజయ్, తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన పెళ్లిచూపులు సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారి, తొలిసినిమాతోనే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ తరువాత ఆయన నటించిన అర్జున్ రెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ ని సాధించి, యూత్ లో విజయ్ కు విపరీతమైన క్రేజ్ తీసుకువచ్చింది. 

అనంతరం పరశురామ్ దర్శకత్వంలో విజయ్ నటించిన గీత గోవిందం కూడా సంచలన విజయం సాధించి విజయ్ ను టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా చేర్చింది. ఇటీవల యువ దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి, ప్రస్తుతం మంచి టాక్ మరియు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా యుఎస్ లో ఒక తిరుగులేని ఒక రికార్డుని నమోదు చేసింది. ఇక ఈ సినిమా ప్రీమియర్ షో కలెక్షన్స్ లో విజయ్ దేవరకొండ ఏకంగా రామ్ చరణ్, వెంకటేష్, నాగ చైతన్యలను వెనక్కినెట్టి మరీ ముందుకు దూసుకెళ్లాడు. ఇక ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం, యుఎస్ లో డియర్ కామ్రేడ్ కు ప్రీమియర్ షోల రూపంలో 310,011 డాలర్లు లభించాయట. 

అయితే ఆ కలెక్షన్ తో డియర్ కామ్రేడ్, గతంలో వచ్చిన వినయ విధేయ రామ’ ‘ఎఫ్ 2’ ‘మజిలీ’ ప్రీమియర్ కలెక్షన్స్ ను దాటేసి అందరిని అబ్బురపరిచింది. ఇక ఈ విషయాన్ని విజయ్ అభిమానులు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తూ సంబరపడిపోతున్నారు. మొదట్లో కాస్త మిక్స్డ్ టాక్ తో మొదలైన డియర్ కామ్రేడ్ సినిమా, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు యుఎస్ లో కూడా ఇంకా మంచి కలెక్షన్స్ రాబడుతోందని విశ్లేషకులు చెప్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: