వివాదాస్పద టీవీ రియాల్టీ షో  బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రేటింగ్ విషయంలో అదరగొట్టింది. ఏకంగా  ఈసీజన్ లాంచ్ ఎపిసోడ్  17.9 టి ఆర్ పి రేటింగ్స్ ను రాబట్టి టెలివిజన్ చరిత్రలో  కొత్త రికార్డు ను క్రియేట్ చేసింది.   గత రెండు సీజన్ల కంటే  ఈ సీజన్ లాంచింగ్  రేటింగ్ ఎక్కువ కావడం విశేషం.  


2017 లో ఈ షో ను తెలుగు ప్రజలకు పరిచయం చేయగా  మొదటి సీజన్ కు  యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా వ్యవహరించాడు.   ఆ సీజన్ లాంచ్ ఎపిసోడ్ కు 16.18 టి ఆర్ పి  రేటింగ్స్ వచ్చాయి.  ఎన్టీఆర్ ఈ షో ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయడంలో  నూటికి నూరు శాతం విజయం సాధించాడు. దాంతో  ఈ షో సెకండ్  సీజన్  ఎప్పుడెప్పుడు స్టార్ అవుతుందా అని ఎదురుచూసారు బిగ్ బాస్ లవర్స్.  ఇక భారీ అంచనాల మధ్య గత ఏడాది  బిగ్ బాస్ 2 ప్రారంభం కాగా  న్యాచురల్ స్టార్ నాని  ఆ సీజన్ కు   వ్యాఖ్యాత గా వ్యవహరించాడు.  ఆ సీజన్ లాంచ్ ఎపిసోడ్ కు 15.05 టి ఆర్ పి రేటింగ్స్ వచ్చాయి.  అయితే  నాని షో నడిపిన తీరు ఫై  ప్రేక్షకులు పెదవి విరిచారు. 


ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ కాగా  కింగ్ నాగార్జున  ఈ షో కి వ్యాఖ్యాత గా  వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్ లాంచ్ ఎపిసోడ్ అన్ని సీజన్ల కంటే ఎక్కువగా 17.9 టి ఆర్ పి రేటింగ్స్ ను రాబట్టిందని స్టార్ మా యాజమాన్యం ప్రకటించింది. దాంతో  నాగ్ హోస్టింగ్ ఫై హ్యాపీ గా వున్నారు షో నిర్వాహకులు.  ఇక 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్ బాస్ 3 లో ఇటీవల  నటి హేమ  మొదటగా ఎలిమినేట్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: