బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత సుజీత్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'సాహో'.  ఇందులో బాలీవుడ్ నటి శ్రద్ద కపూర్ కథానాయికగా నటిస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌ష్టు 30న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.


ఏకంగా రూ.300 భారీ బ‌డ్జెట్ సినిమా కావ‌డంతో రెండు సంవ‌త్స‌రాలుగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే సినిమాలో ప్ర‌తి విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌లు వ‌హించాల్సి తీసుకుంటున్నారు. నిజానికి ఇంత‌కుముందు సినిమా కథలు పాటలు కాపీ కొట్టినా స్ఫూర్తి తీసుకున్నా జనం పెద్దగా పట్టించుకునే వారు... ఎవ్వ‌రికి తెలిసేది కాదు. కానీ ప్ర‌స్తుత టెక్నాలజీతో గూగుల్‌లో కొడితే చాలు క్ష‌ణాల్లో స‌మాచారం అందుతుంది. 


అందుకే దర్శక, నిర్మాతలు చాలా జాగ్ర‌త్త‌గా ఖర్చు అవుతున్నా ఎక్కడో ఉండే కొరియన్ నిర్మాతలను సంప్రదించి హక్కులు కొంటున్నారు. అయినా స‌రే ఎక్క‌డో అక్క‌డ కాపీ మ‌ర‌క‌ల‌తో డీలా ప‌డుతున్నారు. ఇటీవ‌ల సాహోకు సంబంధించి ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తే  ఆ పోస్టర్ హాలీవుడ్‌ నుంచి లిప్ట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జ‌రిగింది. మొన్న విడుదల చేసిన సాహో కొత్త సాంగ్ టీజర్ ఏ చోట నువ్వున్నా కు  సైతం  ఓ ఇంగ్లీష్ పాప్ ఆల్బమ్ లోని డోంట్ గో అవేకు దీనికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. 


అలాగే రిలీజ్ డేట్ ఆగ‌ష్టు 15 నుంచి ఆగ‌ష్టు 30కి మార‌డం,  మ్యూజిక్ డైరెక్ట‌ర్లు మార‌డం, కాఫీ మ‌ర‌క‌లు ప‌డ‌డం ఇలా ఏదోక‌టి సాహో విష‌యంలో వ‌రుస‌గా జ‌రుగుతుంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాపై హైప్‌  క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. అయితే పోస్టర్లు పాటల మీద కాపీ గోల రావడానికి కారణం సాహో టీమ్ మేక‌ర్ల‌కు షూటింగ్ ఆఖరి రోజుల్లో స‌రైన ప్లానింగ్ లేక వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కార‌ణం అన్న టాక్ కూడా వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: