టెలివిజన్ రంగంలో రియాల్టీ షోలో ప్రస్తుతం అదరగొడుతున్న షో బిగ్ బాస్ షో. సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా లో బిగ్ బాస్ హౌస్ గురించి చాలామంది చర్చించుకుంటున్నారు. గత రెండు సీజన్ల కంటే భిన్నంగా మూడవ సీజన్ క్షణం క్షణం రసవత్తరంగా బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లతో అదరగొడుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ త్రీ నీ టెలివిజన్ ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తున్నారు. ఇటువంటి క్రమంలో రెండో సారి ఎలిమినేషన్ అయ్యే రౌండ్ దగ్గర పడుతున్న క్రమంలో ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారికి హౌస్ లో ప్రస్తుతం టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.


ఈ వారం 8 మంది ఎలిమినేషన్ నామినేషన్ కి ఎంపిక కావడంతో షో ఆసక్తికరంగా మారింది. వారి పేర్లు   శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్ విట్టా, వితికా పేరు, వరుణ్ సందేశ్, రాహుల్, పునర్నవి. ఎనిమిది మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయినా సభ్యులు. దీంతో ఈ ఎనిమిది మంది పేర్లు లో ప్రముఖంగా ఇద్దరి పేర్లు ఇంటి నుండి బయటకు వెళ్లే చాన్సులు ఉన్నట్లు టాక్ వినపడుతోంది. నిజంగా ఇంటి నుండి శ్రీముఖి బయటికి వెళ్లే ఛాన్స్ చాలా తక్కువ అని ఆమెకు లక్షల ఓట్లు పడుతున్నట్లు సమాచారం. అయితే మిగతా ఇంటి సభ్యుల బానే ఉన్న ఇద్దరు అనగా ఒకరు జాఫర్ మరొకరు హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక.


వీళ్ళిద్దరిలో కచ్చితంగా ఒకరు హౌస్ నుండి బయటకు ఈవారం వెళ్లిపోతున్నట్లు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా వచ్చిన ఓట్ల పరంగా బయటకు వచ్చిన వార్త ఇది. అయితే వీరిద్దరి లో ఎక్కువగా వరుణ్ సందేశ్ భార్య వితిక హౌస్ నుండి బయటకు వెళ్లి పోయే అవకాశం ఉన్నట్లు ఎందుకంటే కన్నింగ్ గేమ్ ఆడుతూ...భర్త వరుణ్ తో ప్లాన్ వేసి ఇంటి సభ్యుల మధ్య వితిక ఆడే గేమ్ పట్ల వీక్షకులు అసహ్యించుకుంటున్నట్టు దీంతో ఆమె నీ ఇంటి నుండి బయటకు పంపిస్తే హౌస్ ఇంటి సభ్యుల మధ్య అద్భుతమైన ఆట చూడవచ్చు అనే ఉద్దేశంతో వీక్షకులు ఉన్నట్లు దీంతో ఎక్కువగా వితికాకే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: