పూరి జగన్నాథ్‌ - రామ్ కాంబోలో మాస్ మసాలా కథగా తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ . ఇటు వ‌ర‌స‌ ఫ్లాపుల్లో ఉన్న పూరీ మ‌రియు రామ్ ఫ్లాపుల్లో మునిగి తేలుతున్న సంగ‌తి తెలిసిందే. వీళ్లు కలిసి చేసిన ఇస్మార్ట్ శంక‌ర్‌పై అంచనాల ప్రకారం చూస్తే ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు రికార్డు బ్రేక్ చేశాయి. పూరీ తయారు చేసుకున్న మాస్ కథకు మణిశర్మ సంగీతం తోడై ఈ నెల 18న విడుద‌ల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ర‌చ్చ రచ్చ చేస్తోంది. 12 రోజుల్లోనే ఈ సినిమా 65 కోట్లకి పైగా గ్రాస్ ను .. 34 కోట్లకి పైగా షేర్ ను ద‌క్కించుకుంది.


తొలి వారంలో ఆ చిత్రానికి ఎదురే లేకపోయింది. ఆ త‌ర్వాత వారంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'డియర్ కామ్రేడ్స‌ భారీ ప్రమోషన్స్ తో భారీ హైప్ తో ఏకంగా నాలుగు భాషల్లో ఎంతో గ్రాండ్ గా విడుదలైంది. అయితే డియర్ కామ్రేడ్ 'ఇస్మార్ట్ శంకర్' జోరుకు బ్రేక్ పడటం ఖాయమనుకున్నారు. శుక్రవారం పరిస్థితి చూస్తే అది నిజమే అనిపించింది. శుక్రవారం మార్నింగ్ షో, మ్యాట్నీలకు 'ఇస్మార్ట్ శంకర్' వసూళ్లు తగ్గాయి. అయితే డియ‌ర్ కామ్రేడ్‌పై  డివైడ్ టాక్ రావ‌డంతో సాయంత్రానికి సినిమా మళ్లీ ఇస్మార్ట్ శంక‌ర్‌ పుంజుకుంది. 


డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్‌గా పెర్ఫామ్ చేస్తుండగా.. ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడో వారంలో అడుగుపెట్టిన ఇస్మార్ట్ శంక‌ర్ ఏ మాత్రం స్పీడ్ త‌గ్గ‌కుండా అదే స్టాయిలో న‌డుస్తోంది. నిజానికి ఇస్మార్ట్ శంకర్‌కు ఇంత పెద్ద విజయం దక్కుతుందని తాను కూడా ఊహించలేకపోయానని స్వయంగా పూరినే చెప్పాడు.  ముఖ్యంగా మాస్ ఏరియాల్లో ఇస్మార్ట్ హవా కొనసాగుతుంది. చివ‌ర‌కు ఇస్మార్ట్ శంక‌ర్ క్రేజ్ ముందు డియ‌ర్ కామ్రేడ్ నిల‌వ‌లేక‌పోయింది. అలాగే `ఇస్మార్ట్ శంక‌ర్‌` ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 10 కోట్ల వసూళ్లను సాధించించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: