టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పండగే. అదీ తన కొత్త సినిమా అప్డేట్ అంటే అభిమానుల ఆనందమే వేరు కదా. ఇప్పుడు ప్రిన్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చింది. ఈనెల 9 న మహేష్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక మైక్రో టీజర్ విడుదల చేయనుంది చిత్ర బృందం. దాంతోపాటే మహేష్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .


ఈ డబుల్ ట్రీట్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే అంశమే. మహేష్ తన కొత్త సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు , ఇటీవలే కాశ్మీర్ లో తొలి షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా ప్రెసెంట్ యూత్ హార్ట్ త్రోబ్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నో ఏళ్ల తరువాత ఈ చిత్రం ద్వారా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తూ రీఎంట్రీ ఇస్తోంది. ఆగస్టు 9 న మహేష్ పుట్టినరోజు కాబట్టి ఆరోజు ఫ్యాన్స్ కు ఈ రెండు గిఫ్ట్స్ వారికి పండగే!

 

సాధారణంగా హీరోల పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అప్డేట్, టీజర్, ఫస్ట్ లుక్ ఇవ్వడం సహజమే. కేవలం ఫస్ట్ షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి డైరక్టర్ అనిల్ కొంత డిటెయిల్స్ ఇచ్చేశాడు. మహేశ్ ఆర్మీ ఆఫీసర్, పేరు అజయ్ కృష్ణ అని, రష్మిక ఫ్యామిలీలోకి మహేశ్ ఎంటర్ అవుతాడంటూ కొంత లీక్స్ ఇచ్చి తన స్టైల్ లో సినిమా ప్రమోట్ చేయనున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: