ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌, డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందించిన‌ చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ రామ్ స‌ర‌స‌న న‌టించారు. రెండో వారంలో కూడా ఇస్మార్ట్ శంకర్ బ్రేక్ లేకుండా బాక్సాఫీస్ వద్ద హంగామా చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు చూస్తే.. ఇస్మార్ట్ శంకర్ నైజాంలో భారీ వసూళ్లను కొల్లగొట్టింది.  


స‌రైన విజ‌యం లేక చూస్తున్న పూరీ జ‌గ‌న్నాథ్‌కు ఈ చిత్రం ఊహించిన దానికంటే కూడా ఎక్కువే వ‌సూళ్ల రాబ‌ట్టింది. గత 12 రోజుల్లో ఈ చిత్రం నైజాంలో సుమారు రూ.10 కోట్లు మేర కలెక్ట్ చేసినట్టు తెలిసింది. ఈ చిత్రానికి ఛార్మీ నిర్మాత‌గా వ‌హించారు. అస‌లు మాస్ సినిమా అంటే ఇలా ఉంటుందా అనేలా ఈ చిత్రం వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంది. నిజానికి సినిమాలో ఏం లేక‌పోయినా కూడా మాస్ డైలాగులు.. పూరీ మార్క్ ఆటిట్యూడ్.. ప్ల‌స్ అయ్యాయి.


ఇప్ప‌టికే అన్ని ఏరియాల్లోనూ సినిమాను కొన్న బ‌య్య‌ర్లు లాభాల్లోకి వ‌చ్చేసారు. మ‌రియు రూ.17 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రెండు వారాల‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.34 కోట్ల షేర్ రాబ‌ట్టి... రూ.40 కోట్ల షేర్ వైపు దూసుకుపోతోంది. ఏరియాల వారీగా ఈ సినిమా షేర్ ఇలా ఉంది.


ఏరియావైజ్ షేర్ ( రూ. కోట్లలో )...


నైజాం - 13.38


సీడెడ్ - 5.30


నెల్లూరు - 1.05


కృష్ణ - 1.88


గుంటూరు - 1.85


వైజాగ్ - 3.60


ఈస్ట్ - 1.92


వెస్ట్ - 1.61
----------------------------------
ఏపీ & టీస్ షేర్ =  30.59
----------------------------------


రెస్టాఫ్ ఇండియా - 2.15


ఓవర్సీస్ - 1.20
------------------------------------------
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ =  33.94
------------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: