సినిమా లో జనసేనాని పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ఏ వేరు. ఆయన ఇమేజ్ ను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరికి ఆ అభిమానమే అండగా మారుతుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. బిగ్ బాస్ లాంటి బడా రియాలిటీ షో ను కూడా పవన్ మానియా ప్రభావితం చేస్తోంది.


ఇలాంటి కోవకు చెందిన వారిలో శివబాలాజీ ఒకరు. బిగ్ బాస్ సీజన్ వన్ లో పవన్ అభిమాని అయిన శివబాలాజీకి పవన్ అభిమానులు కొండంత అండగా నిలిచి ఆయన్ని బిగ్ బాస్ విన్నర్ గా చేసిన  సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 లో మరో పవన్ కళ్యాణ్ అభిమాని ఉండటం కొసమెరుపు . ఆమె ఎవరో కాదు సైలెంట్ గా క్యూట్ గా ఉన్న ఆశురెడ్డి. తన డబ్ స్మాష్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకున్న ఆశురెడ్డి చూడటానికి అచ్చం సమంత లాగా అనిపిస్తుంది.



ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కారణంగా ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తాను పవన్ కళ్యాణ్ కి వీరాభిమానినని ఆశురెడ్డి చాలాసార్లు చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తో కత్తి మహేశ్ వివాదం జరిగేటప్పుడు తన ఎదపై పవన్ కల్యాణ్ అంటూ టాటూ కూడా వేయించుకొని ఆ పోస్ట్ ను తను పోస్ట్ చేస్తూ తన వీరాభిమానాన్ని చాటుకున్నారు. తాను కూడా పవన్ అని ట్యాటూ వేయించుకోవడం వల్ల ఆయనతో తనకు కూడా ఎఫైర్ ఉన్నట్లా అంటూ ప్రశ్నించారు


అప్పట్లో ఆశురెడ్డి చేసిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమెకు సపోర్ట్ చేస్తున్న వారంతా ఆ ఫోటోను షేర్ చేస్తున్నారు. మరి పవన్ అభిమానులు మరోసారి తమ అభిమాన హీరో, అభిమాని ని బిగ్ బాస్ త్రీ విన్నర్ ని చేస్తారో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: