సినిమా ప్రపంచంలో కొన్ని రకాల నమ్మకాలు కొంతమంది నమ్ముతూ ఉండడం మనం  చూస్తుంటాం. ఇక కొన్ని సినిమాల విషయమై హిట్ మరియు ఫ్లాప్ లకు సంబంధించి రిలీజ్ కు ముందే పక్కాగా వార్తలు రావడం అక్కడక్కడా కొంత జరిగాయి. ఇక త్వరలో విడుదల కాబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో సినిమాలో పాటలు మరియు కామెడీ అంతగా అలరించే స్థాయిలో లేవని, పూర్తి యాక్షన్ సినిమా అవడంతో దర్శకుడు కూడా కామెడీని సినిమాలో ఎక్కడా బలవంతంగా ఇరికించకూడదని భావించినట్లు సమాచారం. 

ఇక ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకులు పాటలు అందిస్తుండడం, అలానే ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలోని రెండు వీడియో ప్రోమో సాంగ్స్ అంతగా ఆకట్టుకోకోకపోవడంతో, సినిమాలో పాటలు కూడా అంతగా బాగోలేదు అనే వార్తలు కూడా వినపడుతున్నాయి. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ నెగటివిటీ ని ముందే నమ్మలేం అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు ఇటువంటి నెగటివిటీనే నాని, విక్రమ్ కుమార్ కాంబోలో రాబోతున్న గ్యాంగ్ లీడర్ పై కొనసాగిస్తున్నారు కొందరు. ఇక వారు చెప్తున్న వివరాల ప్రకారం, ఎక్కువగా డిఫరెంట్ స్టోరీలను తెరకెక్కించడంలో మంచి దర్శకుడిగా పేరుగాంచిన విక్రమ్ కుమార్, ఈ సినిమాలో కూడా మరొక సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని, అలానే సినిమా రెగ్యులర్ ఫార్మట్ లో ఆరు పాటలు, నాలుగు ఫైట్లు అనేలా కాకుండా, స్క్రిప్ట్ ప్రకారం సాగుతుందని, 

మొత్తంగా చూస్తే ఈ సినిమా ఎక్కువశాతం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించే అవకాశాలు తక్కువే అంటూ పలు సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేస్తున్నారు. తమ సినిమాలపై ఈ స్థాయిలో నెగటివిటీ ప్రచారం అవుతుండడంతో ఆ రెండు సినిమాల యూనిట్ సభ్యులు కొంత ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. దీనిపై కొందరు సినీ విశ్లేషకులు మాట్లాడుతూ, గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలకు ఇంకా నెలరోజులు సమయం ఉందని, అంతేకాక ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ మరియు సాంగ్ మాత్రమే బయటకు వచ్చాయని, కాబట్టి వాటితోనే సినిమా అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనేది ముందే తేల్చలేమని, కాబట్టి ఈ సినిమా అధికారిక ట్రైలర్ మరియు పూర్తి సాంగ్స్ బయటకు వచ్చేదాకా ఈ నెగటివిటీని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని అంటున్నారు. మరి ఈ రెండు సినిమాల విషయమై కొనసాగుతున్న ఈ నెగటివిటీకి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: