కాలం మాటున చరిత్ర కూడా మరుగునపడుతోంది.

కానీ చరిత్ర పుటల్లోని ఒక పేజీని ప్రపంచానికి పరిచయం చేయడానికి 'జార్జిరెడ్డి' అనే డిఫరెంట్‌ చిత్రం ఈ తరం ముందుకు వస్తోంది.


దళం దర్శకుడు జీవన్‌రెడ్డి, ఇటీవలికాలంలో 100 కోట్లు వసూలు చేసి, దేశంలో సంచలనం క్రియేట్‌ చేసిన, మరాఠి చిత్రం సైరత్‌ కెమెరామెన్‌ సుధాకర్‌ ఎక్కంటి, వంగవీటి సినిమా హీరో శాండి, కాంబినేషన్‌లో ఓ వైవిధ్య బయోపిక్‌ నిర్మాణం మొదలైంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్‌రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు.


'' 1962నుండి 72 దాకా విద్యార్థి రాజకీయాలు, ఆనాటి సమాజిక, ఆర్థిక రాజకీయ పరిస్థితులు యూనివర్సిటీ పరిణామాలు జార్జ్‌రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌, వరంగల్‌, కేరళ, ఔరంగాబాద్‌, ముంబాయి, పూనె తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ జరగనుంది. భారీ బడ్జెట్‌తో తెలుగు చిత్రాలలోనే డిఫరెంట్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్‌ సినిమాలో ప్రముఖ తెలుగు నటులతోపాటు హిందీ, తమిళ, మలయాళ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది..'' అని, చిత్ర దర్శకుడు జీవన్‌రెడ్డి అన్నారు.


ఉస్మానియా యూనివర్సీటీలో చదువుకున్న విద్యార్థుల్లో జార్జ్‌రెడ్డి పేరు తెలియని వారు ఉండరు. ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జిరెడ్డిని ఉస్మానియా క్యాంపస్‌లో దారుణంగా హత్య చేశారు. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన ఆయన జీవితాన్ని, ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించేదే 'జార్జిరెడ్డి' చిత్రం.


ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో వంగవీటి సినిమా కథానాయకుడు శాండి జార్జ్‌రెడ్డి పాత్రలో కన్పించనున్నాడు. తన పేరును చరిత్రలో శాశ్వతంగా లిఖించుకున్న జార్జ్‌రెడ్డి ఆత్మకథతో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి లుక్‌ను గురువారం విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: