'బిగ్ బాస్ సీజన్ 3' రియాల్టీ షో మంచి జోరుగా జరుగుతోంది. హౌస్ లో ఇంటి సభ్యులు ఎవరికి వారు స్ట్రాటజీలు వేసుకుంటూ ఓపెన్ అయిపోతున్నారు. రోజుకో టాస్క్ రోజుకో గొడవ తో ఇంటి సభ్యులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న బిగ్ బాస్ తాజాగా లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని అద్భుత రీతిలో ఇంటి సభ్యుల చేత చేపించి షో చూసిన వీక్షకులను ఎంతకాలం ఎంటర్టైన్ చేశారు. ఇటువంటి నేపథ్యంలో లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని సాధించిన కంటెస్టెంట్స్ ఒకవైపు ఆనందంగా ఉంటే మరొకవైపు వరుణ్ సందేశ్ తమన్నా సింహాద్రి లు సరిగ్గా జరిగిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో సరిగ్గా పాల్గొన లేదనే వారికి వారే ఒప్పుకొని జైలు పాలయ్యారు.


ఇటువంటి నేపథ్యంలో గురువారం జరిగిన ఎపిసోడ్ లో వరుణ్ సందేశ్ తన బిహేవియర్ బాలేకపోవడంతో రియలైజ్ అయ్యి తనకు తానుగా జైలుకి వెళ్లాడని హిమజ, శివజ్యోతితో మాట్లాడుతుండగా.. వితికాకి కోపం వచ్చింది. తన భర్త ప్రవర్తన బాలేదని నువ్ ఎలా అంటావంటూ హిమజతో వాదనకి దిగింది. ఈ విషయాన్ని తన భర్త వరుణ్ సందేశ్ కి చేరవేసింది వితికా.. అది విన్న వరుణ్ వాళ్లతో డిస్కషన్ పెట్టకని సర్ద్ధిచెప్పే ప్రయత్నం చేశారు.


ఈ విషయంపై కల్పించుకున్న అలీ.. హిమజతో వాదనకు దిగారు. తన తప్పుచేసి జైలుకి వెళ్లాడనే మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదంటూ హిమజకి చురకలేసే ప్రయత్నం చేశారు. అయితే అతడి ప్రయత్నాన్ని తిప్పికొడుతూ 'నువ్ నన్ను కావాలంటే ఎలిమినేట్ చేసుకోగానీ.. తప్పుగా కన్వే చేయకని' హిమజ.. అలీతో చెప్పింది. మధ్యలో పునర్నవి ఇన్వాల్వ్ అవ్వడంతో ఆమెపై హిమజ ఫైర్ అయింది.  దీంతో ఈ గొడవ గురువారం ఎపిసోడ్ కే పెద్ద హైలెట్ అయ్యింది. మరోపక్క ఈ గొడవ ప్లస్ చేసుకుని వితికా హౌస్ లో వ్యూహాలు మీద వ్యూహాలు వేయటం గ్యారెంటీ అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: