చిరంజీవి కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘సైరా’ కు సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ ఇప్పుడు జరుగుతోంది. ఈమూవీని ఎట్టి పరిస్థుతులలో అనుకున్న అక్టోబర్ 2కు విడుదల చేయాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ గ్రాఫిక్ వర్క్స్ ను మూడు ప్రముఖ కంపెనీలకు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ కంపెనీల మధ్య సమన్వయ లోపంతో పాటు ప్రస్తుతం ఈమూవీకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ అవుట్ పుట్ ను చూసి చిరంజీవి పూర్తిగా నిరుత్సాహ పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్స్ చేస్తున్న కంపెనీలను మార్చి మరో కొత్త కంపెనీలకి ఈ బాధ్యతలను అప్పచెప్పితే మరింత ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రస్తుతం ఈ వర్క్ ను కొనసాగిస్తున్న కంపెనీల చేతే మరింత మెరుగైన గ్రాఫిక్స్ వర్క్ అవుట్ పుట్ కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 

ఈ చర్చల వల్ల అనుకున్న స్పీడ్ లో పనులు పూర్తికాని పరిస్థితులలో ఈమూవీ ఫైనల్ అవుట్ పుట్ అనుకున్న విధంగా రాకపోతే ఏమి చేయాలి అని చరణ్ తెగ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులలో ‘సైరా’ మళ్ళీ వాయిదా పడుతుందా అంటూ మళ్ళీ గాసిప్పులు మొదలయ్యాయి.

చారిత్రాత్మక సినిమాగా రూపొందుతున్న ‘సైరా’ గ్రాఫిక్స్ వర్క్స్ లో ఏమాత్రం తేడా జరిగినా అది సినిమా ఫలితం పై తీవ్ర ప్రభావం చూపెడుతుంది కాబట్టి ఈవిషయమై సలహాల కోసం ప్రస్తుతం చరణ్ కొన్ని విదేశీ గ్రాఫిక్స్ వర్క్స్ చేసే కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఈ పరిస్థితులు ఇలా ఉంటే అనుకోకుండా మళ్ళీ ‘సైరా’ వాయిదా పడితే చిరంజీవి కొరటాల మూవీ ప్రాజెక్ట్ మరొకసారి వాయిదా పడినా ఆశ్చర్యం లేదు అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: