వరస   ప్లాప్  లతో  సతమతమౌతున్న హీరో అల్లు అర్జున్.  నా పేరు సూర్య సినిమా  నా పేరు సూర్య తరువాత మరో సినిమా కోసం చాలా రోజులు ఆగాడు అల్లు అర్జున్.   అరవింద సమేత మంచి విజయన్ని సొంతం  చేసుకున్నాక బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.  త్రివిక్రమ్ తన  మార్క్ కథతో సిద్ధం అయ్యాడు.  ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది.  


ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఎప్పుడు లేని విధంగా రెండు సినిమాలను ప్రకటించారు.  ఆ రెండు కూడా ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే స్టార్ట్ కాబోతున్నాయి.  రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాలను స్టార్ట్ చేస్తున్నారు.  అల్లు అర్జున్ 20 వ సినిమా  ఐకాన్ వచ్చే ఈనెలలో షూటింగ్ స్టార్ట్  కాబోతున్నది.  ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని  కార్యక్రమాలు పూర్తి చేసుకొని షూటింగ్ కు రెడీ  అవుతున్నది.  వేణు శ్రీరామ్ దర్శకుడు.  


ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.  దిల్ రాజు నిర్మాణంలో గతంలో అల్లు అర్జున్ మూడు సినిమాలు చేశారు.  ఇది నాలుగో సినిమా.  ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.  దీన్ని వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్.  త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీలో ఎవరెవరు నటిస్తున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉన్నది.  


దీంతో పాటు సుకుమార్ సినిమా కూడా నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించిన కథ.  సుకుమార్ కథ అంటే చాలా ఆసక్తిగా ఉంటుంది.  కథకు మంచి కల్పనను జోడించి తీయడంలో ఆయన సిద్ధహస్తుడు.  ఇక స్క్రీన్ ప్లే విషయంలో సుకుమార్ ఎలా ఉంటారో చెప్పక్కర్లేదు.  ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.  ఇందులో రష్మిక హీరోయిన్ గా తీసుకున్నారట.  దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారని సమాచారం.  సుకుమార్ సినిమా అంటే షూటింగ్ కు కనీసం ఏడాది సమయం పడుతుంది.  కాబట్టి 2020 దసరాకు సినిమాను ఊహించవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: