రాజమౌళి ఏ ముహూర్తాన ‘ఆర్ ఆర్ ఆర్’ మొదలు పెట్టాడో తెలియకపోయినా ఆమూవీ పై వస్తున్న గాసిప్పులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పూణేలో షూట్ చేద్దాము అనుకున్న కీలక షెడ్యూల్ జూనియర్ చరణ్ ల గాయాలతో వాయిదా పడిన పరిస్థితులలో పూణే తనకు అచ్చి రాలేదని భావించిన రాజమౌళి ఇప్పుడు సెంటిమెంట్ రీత్యా ఆ లాంగ్ షెడ్యూల్ ను తమిళనాడుకు మార్చి ఈ నెలలో షూటింగ్ మొదలుపెట్టాలని భావించాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి హీరోయిన్స్ ఎంపిక విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న రాజమౌళికి ఇప్పుడు మరొక కొత్త సమస్య ఎదురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు హడావిడి చేస్తున్న వార్తలు ప్రకారం ఈ తమిళనాడు షెడ్యూల్ కూడ వాయిదా పడింది అంటున్నారు. దీనికి స్పష్టమైన కారణాలు తెలియకపోయినా తిరిగి జూనియర్ కు గాయం అయింది అంటూ వార్తలు ఊపు అందుకున్నాయి. హడావిడి చేస్తున్న ఈ వార్తలలోని నిజాలు తెలుసుకుందామని కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు జూనియర్ మేనేజర్ ను సంప్రదించినా అతడి నుంచి ఎటువంటి స్పందన లేదు అని టాక్. 

దీనితో జూనియర్ కు మళ్ళీ గాయం అయింది అంటూ వస్తున్న వార్తలు నిజమేకాబోలు అంటూ ఊహాగానాలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ నెగిటివ్ వార్తల పై జూనియర్ స్పందిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఈమధ్య కాలంలో జూనియర్ తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి పై తీవ్ర అసహనంలో ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఈ గాసిప్పులను కూడ జూనియర్ ఖండించలేదు. ఇప్పుడు మళ్ళీ జూనియర్ కు గాయం అయింది అని వస్తున్న వార్తల పై కూడ జూనియర్ తన ఖండన ఇవ్వక పోవడంతో ఇలా ప్రతి విషయానికి మౌనముద్ర లోకి వెళ్ళిపోవడం జూనియర్ కు మంచిది కాదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: