ఉస్మానియాలో విద్యార్థి ఉద్యమాలు జరగడం కొత్తేమీ కాదు.అలాంటి ఉద్యమ నాయకుడి జీవితం ఆధారంగా ఒక సినిమా తెరెకెక్కబోతుంది. "జార్జి రెడ్డి" దశాబ్దాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయిన పేరు.హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ, విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జి రెడ్డిని ఆయన ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేసారు.


నేటి తరంలో చాలా మందికి తెలియని జార్జిరెడ్డి జీవితాన్ని వెండితెర మీదకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. "దళం" సినిమాతో విభిన్నమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న "జీవన్ రెడ్డి" ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర యూనిట్ ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఒక కమర్షియల్ సినిమా మాదిరిగా ఉంటుందని ఈ లుక్ చూస్తే అర్థమవుతుంది.


1965 నుండి 1975 వరకు ఉస్మానియాలో చదువుకున్న ప్రతీ విద్యార్థికి జార్జిరెడ్డి గురించి తెలుసు. ఈ తరం వాళ్ళకి అటువంటి తెర్రిఫిక్ లీడర్ గురించి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకి శ్రీకారం చుట్టామని తెలిపారు. మొత్తానికి ఓ ఫర్ గాటెన్ లీడర్ కథను తీసుకు వస్తున్న ఈ టీం ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా మీద ఆసక్తి పెంచింది.వంగవీటి ఫేం "సందీప్ మాధవ్" ఈ చిత్రంలో జార్జిరెడ్డి పాత్రను పోషిస్తుండగా, క్యారెక్టర్ ఆర్టిస్టు సత్యదేవ్ కూడా నటించనున్నాడు.

ప్రముఖ మరాఠీ నటి దేవిక "జార్జిరెడ్డి" తల్లి పాత్రను పోషిస్తుండడం విశేషం. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే మరాఠీ సినిమ "సైరాట్" కి కెమెరామెన్ గా పనిచేసిన సుధాకర్ యెక్కంటి ఫోటోగ్రఫిని అందించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని మైక్ మూవీ బ్యానర్ తో కలిసి త్రీ లైన్స్, సిల్లీ మాంక్స్ స్టూడియో సంయుక్తంగా నిర్మించారు.





మరింత సమాచారం తెలుసుకోండి: