దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా అత్యధిక బడ్జెట్ తో భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న కొత్త సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ టాప్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ మరియు కోలీవడ్ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తుంటే, 

ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నట్లు ఇటీవల సినిమా యూనిట్  ప్రకటించడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోలిద్దరి లుక్ ఎలా ఉంటుంది అనేదానిపై ఇప్పటికే పలువురు వారి అభిమానులు, తమకు నచ్చిన స్టయిల్లో ఫోటోలు ఎడిట్ చేసి, పలు సోషల్ మీడియా వేదికల్లో వాటిని పోస్ట్ చేస్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఇప్పటివరకు వారిద్దరి లుక్స్ బయటకు రాలేదు. ఇకపోతే నిన్న రాత్రి ఈ సినిమాలో ఒక హీరోగా నటిస్తున్న రామ్ చరణ్, అనుకోకుండా మీడియా కంట పడడం జరిగింది. ఇక ఆయనను చూసినవారందరూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోర మీసాలు, వెనక్కి దువ్విన హెయిర్ స్టైల్ తో చరణ్ ఎంతో వెరైటీగా దర్శనం ఇవ్వడం జరిగింది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం, రామ్ చరణ్ ఈ న్యూ లుక్, ఆర్ఆర్ఆర్ మూవీలోని అల్లూరి పాత్ర కోసమేనని, అయితే ఇప్పటివరకు ఆయన ఈ లుక్ ఎవరికంటా పడకూడదని జాగ్రత్తపడి, తలకు టోపీ పెట్టుకుని బయటకు వచ్చేవారని, అయితే నిన్న రాత్రి మాత్రం టోపీ లేకుండా కనపడడంతో, చరణ్ న్యూ లుక్ ఆర్ఆర్ఆర్ కోసమే అనే వార్తలు పలు మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఆయన న్యూ లుక్ ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: