టాలీవుడ్ కి 2000వ దశకంలో దాదాపుగా పది సంవత్సరాల పాటు మెలోడీ బ్రహ్మ మణిశర్మ తన సంగీత మాధుర్యంతో శ్రోతలను అలరించారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అప్పటి హీరోల్లో దాదాపుగా అందరు హీరోలతో పనిచేసిన మణిశర్మ మార్క్ మ్యూజిక్ ని మన వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇక ఆ తరువాత కొత్త తరం రాకతో మణికి అవకాశాలు కూడా తగ్గాయి. ఇక అదే సమయంలో టాలీవుడ్ లో మెల్లగా దేవిశ్రీ ప్రసాద్ హవా మొదలయింది. అనంతరం ఆర్పీ పట్నాయక్, థమన్, 

మిక్కీ జె మేయర్ వంటివారు తనకు పోటీగా ఉన్నప్పటికీ, తన అలరించే పాటలతో దేవిశ్రీ ప్రసాద్ వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగారు. మొదట కోడిరామకృష్ణ గ్రాఫికల్ వండర్ దేవితో ప్రారంభించిన తన సినిమా ప్రయాణాన్ని  ఆనందం, మన్మధుడు, వర్షం, వెంకీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బన్నీ, భద్ర, జల్సా ఇలా వరుసగా సూపర్ డూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు దేవిశ్రీప్రసాద్. ఆ తరువాత ఆయనకు మరింతగా స్టార్ హీరోల సినిమాలకు అవకాశం రావడం మొదలయింది. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని నాచురల్ స్టార్ నాని వరకు మన టాలీవుడ్ లోని అందరూ స్టార్ హీరోలతో పని చేసిన దేవి, కోలీవుడ్ లోనూ తన హవా ని కొనసాగించారు. ఇక ఇప్పటివరకు దాదాపుగా 80 సినిమాల వరకు వర్క్ చేసిన దేవి, నేడు తన 39వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. 

ఇక ఆ వేడుకను పురస్కరించుకుని దేవి పై స్వరపరిచిన బర్త్ డే స్పెషల్ సాంగ్ ని నేడు యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. దేవిశ్రీప్రసాద్ సినిమా, మరియు పర్సనల్ లైఫ్ లను కలగలిపి ఆయన మ్యూజిక్ గొప్పతనాన్ని చాటిచెప్పుతూ సాగిన ఈ సాంగ్ ని హైమత్ ఆలపించగా, పూర్ణాచారి సాహిత్యాన్ని అందించడం జరిగింది. ఆకట్టుకునే సంగీతం, సాహిత్యంతో సాగిన ఈ సాంగ్, ప్రస్తుతం మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. అంతేకాక దేవి ఫ్యాన్స్ మరియు పలువురు సినిమా ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆయనకు బర్త్ డే విషెస్ తెల్పుతున్నారు.....!


మరింత సమాచారం తెలుసుకోండి: