టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో చెప్పుకోవడానికి చాలా సినిమాలే చేశాడు. బెల్లంకొండ కెరీర్ లో అన్ని భారీ బడ్జెట్ సినిమాలే... సినిమా టాక్ ఎలా ఉన్నా కమర్షియల్‌గా ఆ సినిమాలన్నీ బ్రేక్ ఈవెన్‌కు మాత్రం రాలేదు. దీంతో ఐదేళ్లుగా శ్రీనివాస్ కమర్షియల్ హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా కోలీవుడ్ లో హిట్ అయిన రాక్ష‌స‌న్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన రాక్షసుడు సినిమాలో నటించాడు.


అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ర‌మేష్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో బెల్లంకొండ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ ప్ర‌మోష‌న్ ఇంట‌ర్వ్యూలో ఐదేళ్ల సినిమా కెరీర్‌లో తాను చాలా నేర్చుకున్నా.. నన్ను పట్టుకొని వెనక్కి లాగే వాళ్లని పట్టించుకోకుండా ముందుకెళ్లాన‌ని చెప్పారు. అలాగే నన్ను లాగేద్దాం తొక్కేదాం అని ప్లాన్స్ వేసిన వాళ్లు లిస్ట్ పెద్దదే ఉంద‌ని... పేర్లు చెప్పలేను కానీ - వాళ్లు అలా చేసిన ప్రతి సారీ నేను ఎదుగుతూ వచ్చాన‌ని బెల్లంకొండ తెలిపాడు.


ఇక ఒకొనొక టైమ్ లో నా సినిమాకు థియేటర్స్ కూడా లేకుండా చేశారు. అలా చేసిన సినిమానే నాకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింద‌ని కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. బెల్లంకొండ ఇండ‌స్ట్రీలోని కొంద‌రు పెద్ద‌లు గురించే ఈ వ్యాఖ్య‌లు చేశాడ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక ఒకేసారి జ‌య జాన‌కీ నాయ‌క - లై - నేనే రాజు నేనే మంత్రి సినిమాలు రిలీజ్ అయ్యాయి. 


ఆ టైంలో బెల్లంకొండ జాన‌కీ నాయ‌క సినిమాకు థియేట‌ర్లు లేకుండా చేసే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయినా బెల్లంకొండ ఆ సినిమాతో హిట్ కొట్టాడు. ఇదే విష‌యాన్ని ఇప్పుడు చెప్పాడు. ఇక రాక్ష‌సుడు సినిమాకు తొలి ఆట నుంచే హిట్ టాక్ వ‌చ్చింది. మ‌రి ఈ సినిమాతో అయినా బెల్లంకొండ హిట్ కొట్టి ట్రాక్‌లోకి వ‌స్తాడేమో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: