విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన డియర్ కామ్రేడ్ గత శుక్రవారం విడుదలైంది. గీతా గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  మొదటిరోజు ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రుపాయల షేర్ వసూలు చేసింది. కానీ సినిమాకు సరైన టాక్ రాకపోవడంతో రెండో రోజు నుండే ఈ సినిమాకు వసూళ్ళు తగ్గాయి.

 

వీకెండ్ వరకు పరవాలేదనిపించేలా కలెక్షన్లు వచ్చినా సోమవారం నుండి కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. డియర్ కామ్రేడ్ సినిమాకు మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రుపాయల షేర్ వచ్చింది. 34 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డియర్ కామ్రేడ్ సినిమా ఇప్పటిదాకా 60% రికవరీ చేసింది. చాలా ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఇవెన్ అవ్వటం కష్టమని తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాల వరకు ఈ సినిమా పరవాలేదనిపించేలా కలెక్షన్లు సాధించినా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ళు ఏ మాత్రం ఆశాజనకంగా లేవని తెలుస్తోంది.

 

డియర్ కామ్రేడ్ సినిమాకు వారం ముందు విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమా రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈరోజు విడుదలైన రాక్షసుడు, గుణ 369 రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు సినిమాలకు హిట్ టాక్ రావడంతో డియర్ కామ్రేడ్ సినిమాకు కలెక్షన్లు రావడం కష్టమే అని తెలుస్తోంది. ఫుల్ రన్లో డియర్ కామ్రేడ్ షేర్ 23 కోట్ల దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది.

 

డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావటంతో ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ గ్యాంగ్ లీడర్ సినిమాను రీజనబుల్ రేటుకు ఇవ్వాలని మైత్రీ మూవీ మేకర్స్ ను కోరినట్లు తెలుస్తుంది. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావటంతో మైత్రీ మూవీ మేకర్స్ కూడా మిడిల్ రేంజ్ హీరోలను దూరం పెడుతూ స్టార్ హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: