ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ స్టార్లుగా ఎదిగి, ఆర్థికంగా బాగా సెటిలైన తర్వాత చాలామంది హీరో హీరోయిన్లకు పరిశ్రమలోనే నిర్మాణ రంగం లోకి రావాలనిపిస్తుంది. డబ్బులు బాగా సంపాదించాలనో, సినిమా మీద ప్రేమతోనో వారు అక్కడే పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే అక్కడే తేడా కొడుతూ ఉంటుంది.ఇది చాలామంది హీరోయిన్ల గత చరిత్ర చెబుతున్న వాస్తవం. నిర్మాణ రంగంలోకి వెళ్లి చాలామంది హీరోయిన్లు సంపాదించిన డబ్బులను పోగొట్టుకున్న ఉదాహరణలే చాలా ఉన్నాయి. మహానటి సావిత్రి నుంచి జయసుధ వరకు నిర్మాతలుగా మారి నష్టపోయిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. 

సంపాదించుకున్న ఆస్తులు, డబ్బు ఏదో విధంగా పోగొట్టుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారన్న సంగతి అందరికి తెలిసిందే, వారిలో నిర్మాతలుగా మారిన తర్వాత పోగొట్టుకున్న వాళ్లూ కూడా ఉన్నారు. మరి ఈ జాబితాలో కాజల్ అగర్వాల్ కూడా నిర్మాతగా మారబోతున్నట్టుగా కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కాజల్ కి సౌత్ లో ఉన్న దాదాపు అన్నీ భాషల్లోను బాగానే క్రేజ్ ఉంది. ముఖ్యంగా తెలుగు, తమిళం లో అయితే టాప్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. చేసేవన్నీ స్టార్ హీరోల సినిమాలు కాబట్టి రెమ్యునిరేషన్ కూడా భారీగానే అందుకుంటోంది. ఇది కాకుండా యాడ్స్ లోను బాగా సంపాదిస్తోంది. 

తనే లీడ్ రోల్స్ చేసేంత స్థాయికి వచ్చిన కాజల్ తన మార్కెట్ ను క్యాష్ చేసుకోవాలంటూ నిర్మాతగా మారబోతోందని వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్లాన్స్ డ్రాప్ అయ్యారని సమాచారం. కాజల్ నిర్మాతగా మారడంలేదట. వీలైనంత వరకు నటిగా మాత్రమే కొనసాగాలని  డిసైడ్ అయ్యిందట. మరి ఇదే గనక నిజమే అయితే తెలివైన నిర్ణయం తీసుకున్నట్టే అని పరిశ్రమలో చాలా మంది అంటున్నారు. అయితే సిని నిర్మాతగా కాకుండా వేరే వ్యాపారం అయితే మాత్రం చాలా మంది యంగ్ హీరో హీరోయిన్స్ సక్సస్ అయిన సంఘటనలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: