యు.వి. క్రియేష‌న్స్‌, టి.సిరీస్ ప‌తాకం పై యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తాజాగా న‌టిస్తున్న చిత్రం సాహో. ఇండియాలో మెట్ట‌మెద‌టిగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జి తో తెరెకెక్కుతున్న ఈ చిత్రం అగ‌ష్టు 30న  ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లకి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేశారు.  బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టం తో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమా పై భారి అంచ‌నాలు పెట్టుకున్నారు. పూర్తి క్రిస్ట‌ల్ క్లారిటి గా రెబ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఈ సాహో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.  సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి వంశీకృష్ణ‌, ప్ర‌మోద్ ఉప్ప‌ల‌నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో పాట‌ను ప్ర‌సాద్ ల్యాబ్‌లో లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో...


 ద‌ర్శ‌కుడు సుజిత్ మాట్లాడుతూ... ప్ర‌భాస్‌గారితో నాకు మూవీ ఎక్స్‌పీరియ‌న్స్ కంటే ప‌ర్స‌న‌ల్‌గా చాలా ఎక్స్‌పీరియ‌న్స్ ఉంది. ఆయ‌న‌తో నేను ప‌ర్స‌న‌ల్‌గా చాలా ఫ్రెండ్లీగా ఉంటా. దాంతో నాకు సినిమా చేసేట‌ప్పుడు పెద్ద‌గా క‌ష్టం అనిపించ‌లేదు. సాహో సినిమాని బాహుబ‌లితో కంపేర్ చెయ్య‌లేము.  బాహుబ‌లి ఒన్ జ‌రుగుతున్న‌ప్పుడు సాహో క‌థ గురించి చెప్పాను.  ఆయ‌న నేను క‌థ చెప్పే విధానం న‌చ్చి నేను హ్యాండిల్ చెయ్య‌గ‌ల‌నన్నా  న‌మ్మ‌కంతో ఇచ్చిన మాట ప్ర‌కారం నాతో సినిమా చేశారు. అంతా కేవ‌లం న‌మ్మ‌కం వ‌ల్లే జ‌రిగింది. సాహో చాలా పెద్ద చిత్రం.  సాహోకి బాహు బ‌లి విజ‌యంతో సంబంధం లేదు. ఆ విజ‌యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ క‌థ‌లో ఎలాంటి మార్పులు చెయ్య‌లేదు. ఈ క‌థ‌కి ఎంత వ‌ర‌కు అవ‌స‌ర‌మో అంత‌వ‌ర‌కే చేశాము. ప్రోగ్రెస్ అంతా చాలా బాగా వ‌చ్చింది.  ఈ సినిమా షెడ్యూల్ అంతా ఎక్కువ‌గా ఫారెన్‌లో జ‌రిగింది. అక్క‌డ ప్ర‌తిదీ ప‌ర్మిష‌న్స్‌తో సంబంధం కాబ‌ట్టి కాస్త పేప‌ర్ వ‌ర్క్ ఎక్కువ చెయ్యాల్సి వ‌చ్చింది.  ఈ చిత్రంలో మొత్తం మీద 4 పాట‌లున్నాయి. అందులో ఇప్పుడు విడుద‌ల చేసిన మాట మాత్ర‌మే కాస్త రొమాంటిక్ మూడ్ ఉంటుంది. మిగ‌తావ‌న్నీ నార్మ‌ల్‌లాగే ఉంటాయి. ఈ చిత్రంలో ల‌వ్‌స్టోరీ అనేది కాస్త కీల‌క‌పాత్ర వ‌హిస్తోంది. బాలీవుడ్‌, ఇంట‌ర్‌నేష‌న‌ల్ సినిమాలా దీన్ని తెర‌కెక్కించాల‌ని ట్రై చెయ్య‌లేదు. కాక‌పోతే ప్రేక్ష‌కుల‌కు కాస్త కొత్త‌గా చూపించాల‌నుకున్నా. ఈ చిత్రంలోని పాట‌ల‌న్నీ ఒక్కోటి ఒక్కోథీమ్ ఉంటుంది. ఒక్క‌రే మ్యూజిక్ ఎందుకు వేరే వేరే వాళ్ళు ఇస్తే బావుంటుంద‌న్న ఉద్దేశ్యంతో వేరు వేరు మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌ని ఎంచుకోవ‌డం జ‌రిగింది. ఈ సినిమా చాలా పెద్ద‌ది కాబ‌ట్టి నేను ఐదేళ్ళ‌యినా వెయిట్ చేశాను. ఈ మూవీ బడ్జెట్ కంట్రోల్ కూడా మేము ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద్వారా చేశాము. ఈ సినిమా ప్ర‌భాస్‌గారి ఇమేజ్‌, బాహుబ‌లి ఇమేజ్ అనేమిలేదు క‌థ‌కు త‌గ్గ‌ట్టుగానే తెర‌కెక్కించాం. ప్ర‌భాస్ చాలా సూప‌ర్బ్ ప‌ర్స‌న్‌. ఆయ‌నంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయ‌న కోసం ఇంత కాలం వెయిట్ చేశాను అని ముగించారు.


పాట ర‌చ‌యిత క్రిష్ణ‌కాంత్ మాట్లాడుతూ... ఇంత పెద్ద సినిమాలో నాకు మంచి పాట రాసే అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా నాకు ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన యు.వి. క్రిషేష‌న్స్‌కి, సుజిత్‌గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. నాక పాట యొక్క సిట్యువేష‌న్ చెప్పేవారు నేను దానికి త‌గ్గ‌ట్టుగానే ప‌దాల‌ను రాసుకున్నా.


మరింత సమాచారం తెలుసుకోండి: